త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో దాదాపు రెండున్నరేళ్లు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఆసక్తి ఉందనే సంగతి తెలిసిందే. పవన్ మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో రాజకీయాల్లో సక్సెస్ అయితే మాత్రం సినిమాలకు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
రాబోయే 18 నెలల్లో పవన్ నాలుగు సినిమాలను పూర్తి చేయనున్నారని సమాచారం. అయ్యప్పనుమ్ కోషియమ్, హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ సినిమాలతో పాటు పవన్ మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నాలుగు సినిమాలు పూర్తయ్యాక పవన్ సినిమాలకు బ్రేక్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2023 జనవరి నెల నుంచి పవన్ జనసేనకు సంబంధించిన పనులను చక్కబెట్టాలని, పోటీ చేయాల్సిన నియోజకవర్గాన్ని ఎంచుకుని ప్రజలతో మమేకమవ్వాలని పవన్ భావిస్తున్నారని సమాచారం.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల పవన్ సినిమా ప్రణాళికల్లో అనేక మార్పులుచేర్పులు జరిగాయి. అయితే పవన్ అభిమానులు మాత్రం పవన్ రాజకీయాల్లో సక్సెస్ సాధించినా సినిమాలకు మాత్రం దూరం కాకూడదని భావిస్తున్నారు. సినిమాల విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!