బిగ్‌బాస్ టీవీల్లో ఎంత విజయం అందుకుందో తెలిసిందే. మన దేశంలో హిందీలో తొలుత మొదలైన ఈ షో… ఆ తర్వాత దక్షిణాదికి కూడా వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అదరగొడుతోంది. ఇటీవల బిగ్‌బాస్ ఓటీటీ రూపం దాల్చింది. రెగ్యులర్ బిగ్‌బాస్‌కు భిన్నంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం ఓ షోను ఏర్పాటు చేశారు. త్వరలో తెలుగులో ఈ షో మొదలుకానున్న విషయం తెలిసిందే. అయితే మూడు వారాల క్రితమే ఈ ఓటీటీ వెర్షన్ తమిళ్‌లో స్టార్ట్ అయ్యింది.
దానికి ఇప్పుడు హోస్ట్ మారబోతున్నారు. అవును బిగ్‌బాస్ అల్టిమేట్ పేరుతో తమిళంలో ఓటీటీ బిగ్‌బాస్‌ను స్టార్ట్ చేశారు. దీనికి కూడా కమల్ హాసనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 21 రోజులు పూర్తయ్యాయి. ఎప్పటిలాగే కమల్ హోస్ట్‌గా అదరగొడుతున్నారు. అయితే సడన్‌గా కమల్ హాసన్ ఈ రోజు ఉదయం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ అల్టిమేట్ సీజన్ నుండి హోస్ట్‌గా తప్పుకుంటున్నానని, తిరిగి ఆరో బిగ్‌బాస్ సీజన్‌లో కలుస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సినిమా షూటింగ్‌లు, బిగ్‌బాస్ అల్టిమేట్ ఒకేసారి ఉండటంతో…డేట్స్ ఇబ్బంది వస్తోందని, అందుకే ఓటీటీ షో నుండి కమల్ హాసన్ తప్పుకుంటున్నారట. 56 రోజుల ఈ షోలో 21 రోజులు పూర్తయ్యాయి. ఇంకా 35 రోజులు ఉంది. మరి ఈ 35 రోజులు షోను ఎవరు హోస్ట్ చేస్తారు అనేదే ఇక్కడ ప్రశ్న. గతంలో బిగ్‌బాస్ హోస్ట్‌గా కమల్ అందుబాటులో లేనప్పుడు రమ్యకృష్ణ వచ్చారు. ఇప్పుడు ఆమెనే తీసుకొస్తారో లేదంటే వేరే హీరోను తెస్తారో చూడాలి.
గతంలో అయితే కమల్ రానప్పుడు శ్రుతి హాసన్ వస్తుందని, శింబు వస్తాడని వార్తలొచ్చాయి. అయితే అవేవీ నిజం కాలేదు. మరి ఈసారి అలా పేర్లు వచ్చి, వేరే వాళ్లు వస్తారో… లేదంటే బిగ్‌బాస్ టీమ్ ముందుగానే అనౌన్స్ చేసేస్తుందో చూడాలి. ఎవరొచ్చినా కమల్ హాసన్ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. అయినా చూద్దాం ఎవరొస్తారో, ఎలా చేస్తారో.