హీరో గా మరియు డ్యాన్స్ మాస్టర్ గా ఇండియా లోనే మంచి డిమాండ్ ఉన్న సెలబ్రిటీ గా కొనసాగుతున్న ప్రభుదేవా, మొట్టమొదటిసారి దర్శకత్వం వహిస్తూ చేసిన చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. సిద్దార్థ్ – త్రిష జోడిగా నటించిన ఈ సినిమా ఆరోజుల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అప్పట్లో సంక్రాంతి కానుకగా 2004 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమాకి పోటీ గా పవన్ కళ్యాణ్ ‘బాలు’, జూనియర్ ఎన్టీఆర్ ‘నా అల్లుడు’ సినిమాలు విడుదల అయ్యాయి.
ఈ రెండు సినిమాల వసూళ్లను అధిగమించి ఆరోజుల్లోనే ఈ చిత్రం 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అడపాదడపా అవకాశాలను సంపాదించుకుంటున్న సిద్దార్థ్ కి ఈ స్థాయి వసూళ్లు అంటే సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ చిత్రం లో రియల్ స్టార్ శ్రీహరి పాత్ర ఎంత అద్భుతంగా పండిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సిద్దార్థ ఈ చిత్రం లో కేవలం పేరుకు మాత్రమే హీరో, సినిమాలో అసలు సిసలు హీరో శ్రీహరి అని అనిపించేలా చేసింది ఈ చిత్రం.
ఈ సినిమా తర్వాత శ్రీహరి (Sri Hari) సెకండ్ ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ పాత్రకి ముందుగా శ్రీహరి ని అనుకోలేదట, నందమూరి బాలకృష్ణ ని ఈ పాత్ర కోసం సంప్రదించారట. ఇది హీరో పాత్ర కంటే ఎంతో ముఖ్యమైన పాత్ర, అన్నీ రకాల ఎమోషన్స్ ఉంటాయి , బాలయ్య బాబు స్థాయి ఉన్నటువంటి హీరో మాత్రమే చెయ్యగలడు అని ప్రభుదేవా బలంగా నమ్మాడట. బాలయ్య కి కథ చెప్పి కేవలం 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే అడిగారట.
కానీ బాలయ్య అప్పుడు ఏ మూడ్ లో ఉన్నాడో ఏమో తెలియదు కానీ, ఆయన ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఇదే పాత్రని శ్రీహరి ని చేయాల్సిందిగా కోరగా ఆయన వెంటనే ఒప్పుకొని సంతకం చేసాడట. ఫలితంగా ఆ సినిమా శ్రీహరి కి ఇంతమంచి పేరు తెచ్చిపెట్టిందో మనమంతా చూసాము. అయితే బాలయ్య ఈ పాత్ర ని రిజెక్ట్ చేసి వేరే సినిమాని చేసాడు, అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా 5 ఫ్లాప్స్ వచ్చాయి.