నమ్మి డబ్బు పెడితే మోసం చేశారు.. సైఫ్ వ్యాఖ్యలు!

బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సైఫ్ అలీఖాన్. ఈ మధ్యకాలంలో విలన్ రోల్స్ లో కూడా కనిపిస్తూ.. తన సత్తా చాటుతున్నారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు ఈ స్టార్. ఓ ప్రాపర్టీ డీల్ లో తన డబ్బు పోగొట్టుకున్నానని.. ఈ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని కారణంగా తన సంపాదనలో దాదాపు డెబ్భై శాతం కోల్పోయానని చెప్పి షాకిచ్చాడు.

సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘బంటీ ఔర్‌ బబ్లీ-2’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ హోస్ట్ గా వ్యవహరించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సైఫ్. ఈ క్రమంలో ఆయన.. ‘ముంబైలో ఓ స్థలం కొనుగోలు కోసం రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టానని.. ఆ డబ్బంతా మూడేళ్లలో రెట్టింపు అవుతుందని సదరు కంపెనీ వాళ్లు మోసం చేశారని తెలిపారు.

ఆ స్కామ్ లో తను సంపాదించిందంతా పోగొట్టుకున్నానని.. ఆ డీల్ కోసం దాదాపు 70 శాతం పెట్టుబడి పెట్టానని.. తరువాత మోసపోయానని అర్థమైందని.. అయినా అధైర్యపడకుండా కెరీర్ పై దృష్టి పెట్టి తిరిగి సంపాదించుకున్నానని చెప్పుకొచ్చారు. కానీ ఆ స్కామ్ నుంచి కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పట్టిందని వివరించారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Share.