కోలీవుడ్ సీనియర్ హీరో,డి.ఎం.డి.కె అధినేత అయిన విజయ్ కాంత్ ఆరోగ్యం మళ్ళీ క్షీణించింది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతనికి కరోనా కూడా సోకడంతో.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ మృతి చెందారు అంటూ కొన్ని గంటల నుండి ప్రచారం జరుగుతూ వచ్చింది.అయితే విజయ్ కాంత్ భార్య ప్రేమలత ఈ ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం విజయ్ కాంత్ చనిపోయారట. ఈ విషయాన్ని కొన్ని నిమిషాల క్రితం అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో విజయ్ కాంత్(Vijayakanth) అభిమానులు, కోలీవుడ్ జనాలు కన్నీటి పర్యంతం అయ్యారు. కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కొన్నాళ్లుగా విజయ్ కాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు.దీంతో ఆయన కుటుంబ సభ్యులు సింగపూర్, అమెరికా వంటి దేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు.షుగర్ వ్యాధి కారణంగా ఆయన కుడి కాలికి ఉన్న 3 వేళ్ళను వైద్యులు తొలగించడం జరిగింది.
ఆయన రూపం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక మళ్ళీ ఆయన అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. కొన్ని రోజుల క్రితమే విజయ్ కాంత్ చనిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆయన భార్య .. అవి అవాస్తవాలు అంటూ క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఆయన కొత్త ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో.. ఈరోజు ఆయన సడన్ గా ప్రాణం విడిచి అందరితో కన్నీళ్లు పెట్టించారు అని స్పష్టమవుతుంది.
1952 ఆగస్టు 25 న విజయ్ కాంత్ మధురై లో జన్మించారు. ఆయన వయసు 71 ఏళ్లు. విజయ్ కాంత్ ఎక్కువగా మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.