ప్రపంచాన్ని కరోనా ఎంతగా కుదేలు చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే.. కరోనా ఎఫెక్ట్ సినిమా పరిశ్రమ మీద మాత్రం కాస్త గట్టిగా ఉందని మాత్రం చెప్పొచ్చు. థియేటర్లు ఇప్పుడప్పుడే ఓపెన్ అవ్వవు అనే క్లారిటీ నిర్మాతలకు వచ్చేసింది. ఒకవేళ థియేటర్లు ఓపెనైనా రికార్డ్ ఓపెనింగ్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశాలు లేవనే క్లారిటీ కూడా వాళ్ళకి ఈపాటికే వచ్చేసింది. అందుకే కొత్త నిర్మాతలు సినిమా నిర్మాణం జోలికి రావడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ కష్టకాలంలో నిర్మాతలను ఆదుకుంటున్న ఏకైక ప్లాట్ ఫార్మ్ “ఒటీటీ”. భారీ స్థాయి లాభాలు కాకపోయినా కనీసం పెట్టిన మొత్తం వెనక్కి రాబట్టుకోవడానికి నిర్మాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఇందుకు కొందరు హీరోలు సహకరించకపోవడం వారికి పెద్ద తలపోటుగా మారింది.ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్లు ఇవ్వగానే రవిబాబు అర్జెంట్ గా షూటింగ్ మొదలెట్టేశాడు. అందుకు కారణం తన సినిమాను ఒటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేసే అవకాశం రావడమే.
కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఒటీటీ రిలీజ్ ఛాన్స్ వచ్చింది. అయితే.. సదరు చిత్రాల కథానాయకులు ఇంటి నుంచి కదిలి బయటకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. ఆ కారణంగా నిర్మాతలు అటు సినిమా షూటింగ్ ను పూర్తిచేయలేక.. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులుపడుతున్నారు.
Most Recommended Video
మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!