పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా అంటే కొన్నేళ్ల క్రితం వరకు స్టార్ హీరోలు లక్కీగా ఫీలయ్యేవారు. అయితే గత కొన్నేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పూరీ జగన్నాథ్ సినిమా అంటే సక్సెస్ సాధించడం కష్టమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్టైనా వేర్వేరు అంశాలు ఆ సినిమాకు కలిసొచ్చాయని చాలామంది భావిస్తారు. మరోవైపు మహేష్, చిరంజీవి పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వడం లేదు. వాస్తవానికి పూరీ జగన్నాథ్ జనగణమన సినిమాను మొదట మహేష్ బాబుతో తెరకెక్కించాలని అనుకున్నారు.
మహేష్ బాబు కూడా ఈ సినిమాకు అనుకూలంగా ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పూరీ సక్సెస్ ట్రాక్ లో లేకపోవడంతో మహేష్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం మహేష్ కోసం సిద్ధం చేసిన కథతో పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో జనగణమన సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో ఈ సినిమా ఉంటుందో లేదోనని చర్చ జరుగుతోంది.
జనగణమన ఆగిపోతే మాత్రం పూరీ కెరీర్ కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న స్టార్ హీరోలెవరూ పూరీ జగన్నాథ్ ను నమ్మే పరిస్థితి అయితే లేదు. చిరంజీవి సైతం పూరీ జగన్నాథ్ చెప్పిన ఆటో జానీ కథ నచ్చకపోవడంతో పూరీ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు. చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమాకూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్ తన సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటంతో నిర్మాతగా కూడా భారీ నష్టాలు మిగులుతున్నాయి. పూరీ జగన్నాథ్ తో సినిమాలను నిర్మించడానికి ప్రముఖ నిర్మాతలు సైతం ఆసక్తి చూపడం లేదు. పూరీ జగన్నాథ్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలపై దృష్టి పెట్టాల్సి ఉంది.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!