స్టార్‌ హీరోతో రిలేషన్‌పై స్పందించిన స్టార్‌ హీరోయిన్‌.!

స్టార్‌ హీరో – స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి ఫ్రెండ్స్‌ను చూడటం అంత ఈజీనా? మామూలుగా అయితే కష్టం అని చెబుతారు. కానీ ఓ కాంబోను చూస్తే మొత్తం.. కచ్చితంగా సాధ్యమే అని చెబుతారు. ఇంకా చెబితే ఆ ఇద్దరూ ఎలా స్నేహితులుగా ఉంటున్నారు అనే విషయమే ఆసక్తికరమైన అంశం. హీరో మనకు తక్కువ పరిచయం ఉన్నా.. హీరోయిన్‌ మాత్రం మనకు బాగా పరిచయమే. వాళ్లే అజయ్‌ దేవగణ్‌, టబు. వీరిద్దరి స్నేహం గురించి బాలీవుడ్‌లో చాలామంది చెప్పుకుంటూ వస్తారు బాలీవుడ్‌ జనాలు.

తాజాగా వారి స్నేహం గురించి టబు మాట్లాడారు. దీంతో ఆమె మాటలు వైరల్‌గా మారాయి. అజయ్‌ దేవగణ్‌ – టబు కలసి సినిమాలు చేస్తూనే ఉంటారు. ఇటీవల ఈ జోడీ ‘దృశ్యం 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. త్వరలో ‘భోళా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఈ ఇద్దరూ ఇప్పటి నుండి కాదు చాలా ఏళ్లుగా స్నేహితులు. ఒకానొక సమయంలో ఇద్దరూ లవర్స్‌ ఏమో అని అనుకునేవారు కూడా. అయితే కాజోల్‌ను అజయ్‌ పెళ్లి చేసుకున్నాక అజయ్‌ – టబు రిలేషన్‌ టాపిక్‌ ఆగిపోయింది.

అయితే అజయ్‌ – టబు స్నేహం మాత్రం ఆగిపోలేదు. ఇన్నేళ్లుగా వాళ్ల స్నేహం కొనసాగుతూనే ఉంది. టీనేజ్ నుండి అజయ్‌ దేవగణ్‌ – టబు ఒకరికొకరు తెలుసు. ఇద్దరి మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని టబు చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఒక్కోసారి ఒకరినొకరు తిట్టుకుంటామని కూడా టబు చెప్పారు. అజయ్ దేవగణ్‌, టబు తొలిసారి ‘విజయ్ పథ్’ సినిమా కోసం 1994లో కలిశారు. అక్కడి నుండి మొన్నీమధ్య వచ్చిన ‘భోళా’ వరకు ఇద్దరి మధ్య స్నేహం అలానే ఉంది.

అయితే, టబు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడం వెనుక అజయ్‌ దేవగణ్ ఉన్నాడు అని అంటారు. అజయ్‌తో గతంలో టబు స్నేహంగా ఉన్నప్పుడు, కాజోల్‌ను అజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకోవడం కారణగానే.. టబు అలా సింగిల్‌గా ఉండిపోయింది అంటారు. అయితే దీనిపై ఈ ఇద్దరూ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇద్దరి మధ్య స్నేహం ఉందనే చెబుతూ వస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus