టాలీవుడ్ లో టికెట్ రేట్ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ప్రతికూలంగా తీసుకున్న నిర్ణయాలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అతి తక్కువ ధరలకు సినిమా టికెట్లను అమ్ముతుండడంతో అటు నిర్మాతలు ఇటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. థియేటర్ యజమానులు చాలా మంది ఈ మధ్యకాలంలో థియేటర్లను క్లోజ్ చేసేశారు. ఏపీ ప్రభుత్వం ఫిక్స్ చేసిన టికెట్ ధరలకు కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేకపోతున్నామని వాపోతున్నాయి థియేటర్ యాజమాన్యాలు.
తాజాగా మరోసారి టికెట్ రేట్ వివాదం తెరపైకి వచ్చింది. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయంటూ నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నిర్మాత నట్టికుమార్ స్పందించారు. ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరలు, కలెక్షన్స్, షేర్స్ గురించి ఏం తెలియకుండా నాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. సినిమా టికెట్ ధరల విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని..
మరోపక్క కోర్టులో వ్యవహారం నడుస్తోందని.. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదని అన్నారు. ఏపీలో ఉన్న టికెట్ రేట్లు, షేర్స్, కలెక్షన్స్ గురించి తెలుసుకోకుండా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నాని చేసిన వ్యాఖ్యల కారణంగా మిగిలిన సినిమాలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. ఆయన ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని అవమానపరిచేలా మాట్లాడకూడదని..
ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇప్పుడున్న రేట్లతో ఆయన సినిమాకు ఇబ్బంది లేదని.. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయమే వస్తుందని చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!