Chiranjeevi: చిరుని రోజంతా ఎండలో నిలబెట్టారు.. షాక్ ఇచ్చిన నటి కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కు. ఇండస్ట్రీ బాగోగులు చూస్తున్న వ్యక్తి. ఆయన ఏం చెప్పినా ఇండస్ట్రీ జనాలు తప్పకుండా పాటిస్తారు. అయితే ఈ హోదా ఆయనకి ఊరికే వచ్చింది కాదు. సినిమాల్లో అవకాశాలు కోసం ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. సినిమాల్లోకి వచ్చాక కూడా ఆయనికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. గతంలో ఓ దర్శకుడు ఆయన్ని రోజంతా ఎండలో నిలబెట్టాడట. ఈ విషయాన్ని ఓ సీనియర్ నటి చెప్పుకొచ్చింది.

ఆమె మరెవరో కాదు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాల్లో ప్రభాస్ తల్లిగా నటించిన తలసి. ఆమె మాట్లాడుతూ….’చిరంజీవిగారు చాలా క‌ష్టాల‌ను ఎదుర్కొన్నారు. కోత‌ల రాయుడు సినిమా షూటింగ్‌ టైంలో ఆయన ఓరోజు షూటింగ్ కు కాస్త లేటుగా వ‌చ్చారు. అది నిర్మాత‌ ఈ విషయమై కోప్పడ్డారు. దాంతో చిరంజీవిని ఎండ‌లోనే నిల‌బ‌డ‌మ‌ని అన్నారు. చిరంజీవిగారు ఏమీ కోపగించుకుని వెళ్లిపోలేదు. నిర్మాత ఇచ్చిన ప‌నిష్‌మెంట్‌ను తీసుకుని రోజంతా ఎండ‌లోనే నిల‌బడ్డారు.

త‌ర్వాత రోజు షూటింగ్ కు కరెక్ట్ టైం వచ్చి చేసుకున్నారు. ఆ విషయాన్ని మ‌న‌సులో పెట్టుకుని కృంగిపోలేదు. ఆయ‌న ఇండస్ట్రీకి ఇచ్చిన గౌర‌వం అది. ఆ విష‌యాన్ని ఈ మధ్యనే నేను ఓసారి గుర్తు చేస్తే.. న‌వ్వుకున్నారు. అవ‌మానాల‌ను ఆయన లెక్కచేయలేదు. ఆ తత్వమే ఆయన్ని మెగాస్టార్ ను చేసింది. కోతల రాయుడు తర్వాత ఆయ‌న‌తో మంత్రి గారి వియ్యంకుడు, మ‌గ మ‌హారాజు వంటి చిత్రాల్లో కూడా నేను కలిసి న‌టించాను.నేను ఆయన్ని అన్న‌య్య అని సంబోధిస్తాను. ఆయ‌న కూడా నన్ను అంతే బాగా రిసీవ్ చేసుకుంటారు” అంటూ చెప్పుకొచ్చింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus