బొడ్డుపల్లి బాల వసంత అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తు రాకపోవచ్చు కానీ బి.వసంత అనగానే సింగర్ గా ఆమె పాడిన అలనాటి పాటలు ఎన్నో గుర్తుకు వస్తాయి. చందమామ రావే జాబిల్లి రావే అంటూ ఆమె పాడిన పాట ఇప్పటికీ తెలుగు లోగిల్లలో వినిపిస్తుంది. తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ, హిందీ ఇలాసుమారు 8 భాషలలో సుమారు పదివేలకు పైగా పాటలు పాడిన వసంత గారు ఆమె వ్యక్తిగత జీవితం అలానే తన కెరీర్ అప్పటి రోజుల్లో ఎలా రిలేషన్స్ ఉండేవి లాంటి విషయాలను తెలిపారు.
ప్రస్తుతం తెలుగులో ఒక ఊపు ఊపుతున్న సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ వసంత గారి సొంత చెల్లి కొడుకు కావడం విశేషం. వసంత గారు సింగర్ గా పాడుతూ డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించారు. తన చెల్లెళ్ళ పెళ్లిళ్లు జరిగాక తాను చేసుకుని స్థిరపడ్డారు. ఇక ఒక చెల్లి కొడుకైన థమన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉందని తాను సాధించలేకపోయినది కొడుకు గా సాధిస్తున్నందుకు ఆనందంగా ఉందంటూ తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం సినిమాలో “బృందావనం అది అందరిది గోవిందుడు అందరివాడేలే” పాటను థమన్ తన చేత పాడించుకున్నాడని అందుకు రెమ్యూనరేషన్ కూడా ఇచ్చాడని తెలిపారు. ఇక తన మ్యూజిక్ లో వచ్చిన పాటలను తక్కువగా వింటుంటానని చెప్పారు. ఇప్పుడు పాటలు తనకు అర్థం కావని అవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కలిపి ఉండటం వల్ల అర్థం కావంటూ చెప్పారు. అయితే కొన్ని పాటలు బాగానే ఉంటాయని ‘అలా వైకుంఠపురంలోని సమాజవరగమనా అనే పాట చాలా బాగుంటుందని చెప్పారు.