వికటించిన ప్లాస్టిక్ సర్జెరీ.. నటి ప్రాణాలు పోయాయి..!

ప్రముఖ టీవీ నటి మరణించడం కలకలం సృష్టించింది. ప్లాస్టిక్ సర్జెరీ వికటించిన కారణంగా ఆమె మరణించినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. కన్నడ బుల్లితెర పై పాపులారిటీ సంపాదించుకున్న చేతనా రాజ్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవడానికి రెడీ అయ్యింది.మే 16న బెంగుళూరులోని శెట్టి సౌందర్య హాస్పిటల్ లో ఆమె ఫ్యాట్ ఫ్రీ సర్జరీ కోసం కాస్మొటిక్ సర్జరీని ఆశ్రయించింది. ఎలాగైనా తక్కువ రోజుల్లో సన్నబడాలని ఈమె చాలా రోజులుగా కాస్మొటిక్ వైద్యులను ఆశ్రయిస్తూ వస్తోంది.

చివరికి సర్జెరీ చేయించుకుంటున్న టైములో సాయంత్రానికి ఆమె ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆమెకు ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. ఇది గమనించిన శెట్టి సౌందర్య హాస్పిటల్ డాక్టర్లు.. వాళ్ళ హాస్పిటల్లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్లోని కడే హాస్పిటల్‌కు ఆమెను తరలించారు.కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సరైన వైద్య పరికరాలు లేకుండా సర్జరీ చేసినందువల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని చేతనా తల్లీదండ్రులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం చేతనా మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచారట. పోస్ట్‌మార్టం నిమిత్తం రేపు ఉదయం రామయ్య ఆసుపత్రికి తరలించనున్నారని సమాచారం. చేతనా వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే కావడం మరింత విషాదకరం. గతంలో ఆర్తి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్ కూడా ఇలా సన్నబడడానికి సర్జెరీ చేయించుకుంటున్న సమయంలో మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Share.