నార్త్ లో మన సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువగానే కనిపిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం 2021 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఆ మూవీకి ఇక్కడ మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ నార్త్ జనాలు మాత్రం ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా అక్కడి నార్త్ జనాలు ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు. ఈ మూవీ మొత్తం చిత్తూర్ స్లాంగ్ తో ఉంటుంది. నేటివిటీ కూడా వాళ్ళకి చేరువయ్యేది కాదు.
కానీ బాలీవుడ్లో ఆ మూవీ అంత ఘన విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అల్లు అర్జున్ కు నార్త్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఆ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది. రూ.100 కోట్ల నెట్ కలెక్షన్లను కూడా సాధించింది. ‘పుష్ప’ పాత్రని అక్కడి జనాలు ఎంతలా ఇమిటేట్ చేసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏకంగా విగ్రహాలు పెట్టేంతలా ఓన్ చేసుకుంటారు అని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు.
అల్లు అర్జున్ ను మాత్రమే కాదు ఎన్టీఆర్ ను కూడా అక్కడి జనాలు బాగా ఓన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో కొమరం భీమ్ పాత్ర అక్కడి జనాల్ని బాగా అలరించింది. నార్త్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ గుక్కతిప్పుకోకుండా హిందీలో మాట్లాడటం అక్కడి జనాలను బాగా ఆకర్షించింది. కొమరం భీముడొ పాటలో ఎన్టీఆర్ నటన కూడా నార్త్ జనాలను బాగా అలరించింది. అందుకే అక్కడ ఎన్టీఆర్ కొమరం భీమ్ విగ్రహాన్ని పెట్టేసి పాలాభిషేకాలు కూడా చేసేస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల మాస్ యూరోఫియా ఇదని చెప్పొచ్చు.