యే స్టార్ హీరోకి సాధ్యం కాని రేంజ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సురేష్. మొదటి సినిమాతోనే వినాయక్ లాంటి టాప్ అండ్ మాస్ డైరెక్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ అయిపోయారు. థియేట్రికల్ పరంగా ఆ సినిమా హిట్ . అంతే కాదు మొదటి సినిమాతో 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన రికార్డు ఇప్పటికీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు మీదే ఉంది. అయితే తన మార్కెట్ అనుకుని తరువాత భారీ బడ్జెట్ సినిమాలు చేసి బుక్ అయిపోయాడు మన బెల్లం బాబు. ఫలితంగా 5 ప్లాప్ లు అందుకున్నాడు.
ఇక లో బడ్జెట్ లో ‘రాక్షసుడు’ చిత్రం చేసి హిట్ కొట్టడంతో … తప్పు తెలుసుకున్నాడు అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న చిత్రానికి 30 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టించాడట. దీంతో ఇప్పుడు అంత రేటుకి బిజినెస్ అవ్వని పరిస్ధితి. థియేట్రికల్ 13 కోట్లకు మించి పలకట్లేదట. ఇక శాటిలైట్ రైట్స్ 6 కోట్లకు జెమిని వారు దక్కించుకున్నారు. హిందీ డబ్బింగ్ మరియు డిజిటల్, శాటిలైట్ రైట్స్, ఇక తెలుగు డిజిటల్ రైట్స్ కలుపుకుని 11 కోట్ల పైన రావాలి. లేకపోతే నిర్మాతకి నష్టాలు తప్పవు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి..!
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!