Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Reviews » Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 7, 2025 / 06:41 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అభిషేక్ బెనర్జీ (Hero)
  • మియా మాయెల్జర్ (Heroine)
  • శుభం వర్ధన్ హరీష్ ఖన్నా, సాహిదూర్ రెహమాన్ తదితరులు (Cast)
  • కరణ్ తేజ్ పాల్ (Director)
  • గౌరవ్ దింగ్రా (Producer)
  • అర్పాద్ బాండీ (Music)
  • ఇషాన్ ఘోష్ - సచిన్ ఎస్.పిళ్లై (Cinematography)
  • Release Date : జూన్ 04, 2025
  • జంగల్ బుక్ (Banner)

ఒక్కోసారి ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా, అసలు ఇదొక సినిమా ఉందా అని తెలియకుండా చూసిన సినిమాలు భలే థ్రిల్ చేస్తుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే “స్టోలెన్” (Stolen). ఈ హిందీ సినిమా ఎన్నో ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టిఫల్స్ లో ప్రదర్శితమై చాలా అవార్డులు గెలుచుకుని ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఒక సోషల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Stolen Review

Stolen Movie Review and Rating!

కథ: తమ్ముడిని పిక్ చేసుకుందామని రైల్వే స్టేషన్ కి వస్తాడు గౌతమ్ (అభిషేక్ బెనర్జీ), అక్కడ తమ తమ్ముడు రమణ్ (శుభమ్ వర్ధన్)ను రైల్వే స్టేషన్ లో కొందరు పట్టుకొని కొడుతూ ఉంటారు. గొడవ ఏంట్రా అని ఆరా తీస్తే.. తన తమ్ముడు జంపా (మియా మాయెల్జర్) అనే అమ్మాయి కన్న పసిబిడ్డను దొంగిలించాడని అతడ్ని కొడుతూ ఉంటారు.

ఆ సమయంలో తమ్ముడిని నిరపరాధిగా ప్రూవ్ చేసి ఆ కేస్ నుంచి బయటపడాలంటే.. ఉన్న ఒకే ఒక్క దారి ఆ పసిబిడ్డను కనిపెట్టడం. దాంతో లోకల్ పోలీసులు, జంపా తో కలిసి గౌతమ్ & రమణ్ ఆ చిన్నారిని వెతకడం మొదలుపెడతారు.

ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? తెలుసుకున్న జీవిత సత్యాలు ఏమిటి? చుట్టూ ఉన్న ప్రజలు లేదా సమాజం వాళ్లకి సహాపడ్డారా లేక ఆటంకంగా నిలిచారా? వంటి ప్రశ్నలకు సమాధానమే “స్టోలెన్” (Stolen) చిత్రం.

Stolen Movie Review and Rating!

నటీనటుల పనితీరు: ఇప్పటివరకు అభిషేక్ బెనర్జీని ఎక్కువగా కామెడీ రోల్స్ లో చూసాం, “పాతాళ్ లోక్”లో మరీ సీరియస్ రోల్. అలాంటిది ఈ సినిమాలో ఒక రెగ్యులర్ రోల్ అయినప్పటికీ.. ఆ పాత్రలో ఎన్నో ఎమోషన్స్. పాత్ర చుట్టూ భీభత్సమైన డ్రామా నడుస్తుంటుంది. ఆ డ్రామాకి తగ్గట్లుగా అభిషేక్ పండించనే భావాలు ఒకపక్క భయం పుట్టిస్తూనే, మరోపక్క ఆలోచింపజేస్తాయి. ఇంత కాంప్లెక్స్ క్యారెక్టర్ ను ఈమధ్యకాలంలో చూసి ఉండం.

అలాగే.. జంపా అనే తల్లి పాత్రలో మియా అద్భుతంగా ఒదిగిపోయింది. ఆమె క్యారెక్టర్ చుట్టూ జరిగే డ్రామా, ఆ క్యారెక్టర్ ద్వారా క్రియేట్ అయ్యే టెన్షన్, రివీల్ అయ్యే ట్విస్టులు కథను మరింత రంజింపజేస్తాయి. మన సమాజంలో మనుషులు వ్యవహరించే తీరుకు జంపా, ఆమె కూతురు చంపా పాత్రలు చెంపపెట్టుగా ఉంటాయి.

సినిమాలో మోస్ట్ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ రమణ్ పాత్ర పోషించిన శుభం వర్ధన్ ది. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి వంటి ఎన్నో అంశాలను ఈ పాత్ర ద్వారా చెప్పుకొచ్చాడు దర్శకుడు. అతడి కళ్లల్లో అంతే ధైర్యం కనిపిస్తుంది.

మిగతా పాత్రధారులు కూడా ఎంతో సహజంగా ఒదిగిపోయారు. ప్రతి ఒక్క పాత్ర చాలా చక్కగా ఉంటుంది.

Stolen Movie Review and Rating!

సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ సినిమాటోగ్రఫీ & బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులు. సినిమాలో కనిపించే బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులు ఎంత ఇంటెన్సిటీ క్యారీ చేస్తే సన్నివేశం, అందులోని ఎమోషన్ అంత అద్భుతంగా పండుతుంది అనేందుకు ఈ చిత్రం సరైన ఉదాహరణగా నిలుస్తుంది. ప్రీక్లైమాక్స్ లో ఒక సీరియస్ సీన్ నడుస్తుంటుంది, ఏ ఒక్క ఫ్రేమ్ లోనూ సీరియస్ గా లేని ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ కనిపించడు. దర్శకుడు ఎంత జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించాడు అనేందుకు ఇది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డి.ఐ వంటి టెక్నికాలిటీస్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. సన్నివేశాలు ఎంత సహజంగా ఉన్నాయంటే.. జనాలకి తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసినట్లుగా ఉంటుంది.

దర్శకుడు కరణ్ తేజ్ పాల్ ఈ సినిమాలో ఎక్కడా పాత్రల పరిచయాలని, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనీ ఒక్క ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయలేదు. ఓపెనింగ్ సీక్వెన్స్ నుంచే కథలోకి వెళ్లిపోయాడు. పాత్ర స్వభావాలను కూడా కథలో భాగంగానే పరిచయం చేయడం అనేది కథా గమనానికి ఎక్కడా బ్రేక్ వేయలేదు, స్లో చేయలేదు. అలాగే.. వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో కనిపించే వార్తలను, వీడియోలను చూసి నిజం అనుకునే సమాజం చేసే పిచ్చి పనులు ఎంత ప్రమాదకరంగా ఉంటాయి, అలాగే గుంపు మనస్తత్వం సమాజానికి ఎంత చేటు అనేది ఈ సినిమాలో చాలా స్పష్టంగా చూపించారు. “అనుకోకుండా ఒకరోజు” తర్వాత మాబ్ మెంటాలిటీని సరిగ్గా పిక్చరైజ్ చేసిన చిత్రం “స్టోలెన్” అని చెప్పొచ్చు. ఇలా సమాజాన్ని ప్రశ్నించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ హార్డ్ హిట్టింగ్ గానే ఉంటాయి. ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన కరణ్ తేజ్ పాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అతడి దృష్టికోణం కచ్చితంగా ప్రస్తుత సమాజానికి చాలా అవసరం. కరణ్ ఈ తరహా సినిమాలు మరెన్నో తెరకెక్కించి, సమాజాన్ని ఆలోచింపజేయాలి.

Stolen Movie Review and Rating!

విశ్లేషణ: కొన్ని సినిమాలు మన ఆలోచనాధోరణిని, మన చుట్టూ ఉన్న మనుషుల వ్యక్తిత్వాల్ని ప్రశ్నించేలా చేస్తాయి. అలాంటి ఒక సినిమానే “స్టోలెన్”. అభిషేక్ బెనర్జీ నటన, కరణ్ తేజ్ పాల్ దర్శకత్వ ప్రతిభ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే. ప్రస్తుతానికి కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ సంస్థ త్వరలోనే అన్నీ భాషల్లో అనువదిస్తే బాగుంటుంది.

Stolen Movie Review and Rating!

ఫోకస్ పాయింట్: సమాజాన్ని ఆలోచింపజేసే “స్టోలెన్”.

రేటింగ్: 3.5/5

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Banerjee
  • #Karan Tejpal
  • #Mia Maelzer
  • #Shubham Vardhan
  • #Stolen

Reviews

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bakasura Restaurant Review in Telugu: బకాసుర రెస్టారెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mothevari Love Story Review in Telugu: మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Arabia Kadali Review in Telugu: అరేబియా కడలి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ అవసరమా?

trending news

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

Naga Vamsi: ‘వార్ 2’ కోసం ‘మాస్ జాతర’ విషయంలో మనసు మార్చుకున్న నాగవంశీ?

1 hour ago
Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

Shankar: హీరోగా డెబ్యూ ఇవ్వనున్న శంకర్ కొడుకు?

2 hours ago
The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

2 hours ago
Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

Sir Madam Collections: జస్ట్ యావరేజ్.. రెండో వీకెండ్ గట్టిగా క్యాష్ చేసుకోవాలి

15 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

Mahavatar Narsimha Collections: మొదటి వారం కంటే రెండో వారం ఎక్కువ కలెక్ట్ చేసిందిగా..!

16 hours ago

latest news

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

Kingdom Collections: ఈ 3 రోజులు చాలా కీలకం..!

18 hours ago
Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

Kingdom OTT Release: ‘కింగ్డమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

19 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు విడుదల

21 hours ago
చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్  కొట్టాడు

చరణ్, ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ యాక్సెప్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

1 day ago
Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version