ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ చేసే మూవీ ఏమై ఉంటుందని అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. అనేక మంది దర్శకుల పేర్లు ఈ లిస్ట్ లో వినిపించాయి. ప్రముఖంగా తమిళ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న అట్లీ, కన్నడ డైరెక్టర్ కెజిఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. టాలీవుడ్ నిర్మాతలు ఈ దర్శకులకు ఇప్పటికే అడ్వాన్సులు చెల్లించి వున్నారు. దీనితో ఎన్టీఆర్ 30వ చిత్రం వీరిద్దరిలో ఎదో ఒక దర్శకుడితో ఉంటుందని భావించారు. ఐతే అనూహ్యంగా ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో కమిట్ అయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరుగగా మే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఐతే ఎన్టీఆర్ అట్లీ, ప్రశాంత్ నీల్ ని కాదని త్రివిక్రంతో ఎందుకు కమిట్ అయ్యాడు అని ఆలోచిస్తే దాని వెనుక పెద్ద ప్లానే కనిపిస్తుంది. రాజమౌళితో హిట్ అందుకున్న ఏ హీరో మూవీ అయినా నెక్స్ట్ అట్టర్ ఫ్లాప్ కావడం అనేది ఆనవాయితీ. ఇంత వరకు ఈ సెంటిమెంట్ తప్పింది లేదు. ప్రభాస్ సాహో రిసల్ట్ తాజా ఉదాహరణ. అందుకే ఎన్టీఆర్ మన నేటివిటీకి దూరంగా ఉండే ఇతర భాషల దర్శకులపై మక్కువ చూపలేదు.
ఆర్ ఆర్ ఆర్ తరువాత వారితో సినిమా చేయడం రిస్క్ అని ఆయన భావించారు. గతంలో కూడా కొందరు స్టార్ హీరోలు తమిళ దర్శకులతో కమిటై ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. ఇది మరొక సెంటిమెంట్. మరి త్రివిక్రంతో కమిట్ కావడానికి కారణం త్రివిక్రమ్ సినిమాలు ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉంటాయి. ఆయన సినిమాలు అన్ని, సూపర్ హిట్ లేదా పర్వాలేదు అన్నట్లు ఉంటాయి. ఒక్క అజ్ఞాతవాసి మినహా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు లేవు. అందుకే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కి ఓటేశాడు.