మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో తన 152 వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ చిత్రంలో చిరు ఓ కమ్యునిస్ట్ గా కనిపించబోతున్నట్టు.. ఇటీవల లీక్ అయిన ఓ పిక్ చూస్తే స్పష్టం అవుతుంది. అయితే ఈ చిత్రంలో యంగ్ చిరంజీవి పాత్ర ఓ లెక్చరర్ అని తెలుస్తుంది. అసలు లెక్చరర్ గా ఉన్న ‘ఆచార్య’ .. నక్సలైట్ గోవింద గా ఎలా మారారు. అసలు దానికి తీసిన పరిస్ధితులు ఏంటి.. అన్నది అసలైన కథ. నిజానికి 40 నిమిషాల పాటు ఉండే.. లెక్చరర్ పాత్ర చాలా ఇంటెన్సిటీ .. అలాగే పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్రలో మొదట చరణ్ నటించాల్సి ఉంది. అయితే రాజమౌళి తెరక్కిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ చాలా బ్యాలెన్స్ ఉంది. అందులోనూ 2021 జనవరి 8 అంటూ విడుదల తేదీ కూడా అనౌన్స్ చేసేసారు. కాబట్టి ఆ పాత్ర చరణ్ చేయడం కుదరట్లేదు.
దీంతో చిరు ఈ పాత్రని అల్లు అర్జున్ తో చేయిద్దాం అని చరణ్ తో చెప్పారట. గతంలో ‘రుద్రమదేవి’ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రని బన్నీ చాలా బాగా చేసాడు కాబట్టి… తనే కరెక్ట్ అని సిఫార్స్ చేసారట చిరు. అయితే మరోపక్క కొరటాల ఆ పాత్రకి మహేష్ అయితే బెటర్ అని… చెప్పాడట. ఇక చరణ్ కి… మహేష్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. చిరుకి కూడా మహేష్ పై ఎంతో నమ్మకం ఉంది. ఇక బన్నీ కూడా సుకుమార్ సినిమా కోసం లుక్ మార్చాడు. ఈ మధ్య ఆ పాత్ర కోసం లావయ్యి మాస్ లుక్ లోకి వచ్చాడు. అందుకే ఈ పాత్రకి మహేష్ నే చరణ్ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మహేష్ సినిమా కూడా డిలే అయ్యింది.. అందులోనూ తనని రెండు సార్లు ఆదుకున్న కొరటాలతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. ఇందులో భాగంగా షూటింగ్ పార్ట్ కు 30 రోజుల కాల్షీట్స్ కు ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.