చిత్ర పరిశ్రమలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్న కూడా ఒక్క విషయంలో మాత్రం కొంతమంది నిర్మాతలు భారీ స్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. అదే పైరసీ. నిర్మాతలు దర్శకులు ఎంతో కష్టపడి అంగరంగవైభవంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాలను ఈ పైరసీ భూతం నిత్యం కలవరి పెడుతూనే ఉంది. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన RRR సినిమా కూడా అదే తరహాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో కష్టపడి సినిమాలు నిర్మిస్తే థియేటర్స్ లో చూడకుండా కొంతమంది అదే తరహాలో వైరల్ అయ్యేలా చేయడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇక రీసెంట్ గా ఒక షార్ట్ ఫిలిం అయితే పైరసీ చూసేవారికి కూడా దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చింది అనే చెప్పాలి. కారులో దర్జాగా పైరసీ సినిమాలు చూస్తూ ఉన్నా ఇద్దరినీ చారిటీ కోసం డబ్బులు అడగడానికి వచ్చిన ఒక వ్యక్తి ప్రశ్నించిన విధానం ఆలోచింపజేస్తుంది.
ఆ సినిమా ఇద్దరు హీరోలు చేసింది కాదు రెండు వేల మంది ఎంతో కష్టపడే చేశారు. వారి పొట్ట కొడుతున్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలోనే పనిచేసే ఒక వ్యక్తి హార్ట్ సర్జరీ కోసం ఈ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము అలాంటి వారిని మీరు ద్రోహం చేస్తున్నారు అనే విధంగా షార్ట్ ఫిలింలో చాలా అద్భుతంగా ప్రశ్నించారు. సిగ్గు శరం ఉండాలి అని కూడా చెప్పిన విధానం ఆలోచింపజేస్తుంది. ఏదేమైనా పెద్ద సినిమాలకు మాత్రం పైరసీ కోలుకోలేని దెబ్బ కొడుతుంది.
దాదాపు కొన్ని కోట్ల రూపాయల నష్టాలు అక్కడే పైరసీపై దెబ్బ పడుతోంది. ఎంత పోరాటం చేసిన వాటిని ఆపే శక్తి మాత్రం ఇంకా పుట్టలేదు. ఒక దానిని ఆపాలి అంటే అది కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది అని వారు చూడకపోతే మళ్ళీ అలాంటి లింక్స్ కూడా ఎవరు షేర్ చేయరు. మరి జనాల్లో జ్ఞానోదయం ఏనాటికి కలుగుతుందో చూడాలి.