‘బాహుబలి’ తరువాత రాజమౌళి నుండీ రాబోతున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం కావడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి దేశ విదేశాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ 2021 సంక్రాంతికే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని చూసే వాళ్ళం. కానీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో.. ‘ఆర్.ఆర్.ఆర్’ ను 2021 చివర్లో అయినా చూస్తామా అనే అనుమానం నెలకొంది. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పటికే.. చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలయ్యింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ టీజర్ లేటయ్యింది. ఏదేమైనా అక్టోబర్ 22న ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కాబోతుంది. ‘రామరాజు ఫర్ భీం’ పేరుతో ఈ టీజర్ విడుదల కాబోతుంది.ఇప్పటికే టీజర్ పనులు దాదాపు పూర్తయ్యాయట. బ్యాలన్స్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది..! కీరవాణి 4 రోజుల్లోనే ఆ పనంతటిని పూర్తి చేశారట. అయితే చరణ్ చెప్పిన డైలాగులను మిక్స్ చెయ్యగా కొంచెం డిస్టర్బన్స్ వస్తుందట.
దాంతో చరణ్ ను మళ్ళీ డబ్బింగ్ చెప్పాలని రాజమౌళి కోరాడట.లాక్ డౌన్ టైంలోనే చరణ్ తన ఇంట్లో ఉండి.. భీమ్ టీజర్ కు డబ్బింగ్ చెప్పాడట. అయితే ఈసారి స్టూడియోకి వచ్చి డబ్బింగ్ చెప్పాలని చరణ్ ను రాజమౌళి కోరాడట. అందుకు చరణ్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ ఎంత హైలెట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.