Prashanth Neel, Prabhas: ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ స్పెషల్ సెట్!

ప్రభాస్ ‘సలార్’ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలోనే సినిమా టీజర్ వస్తుందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘సలార్’ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. మే చివరి వారంలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. దీనికోసం భారీ సెట్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ ‘సలార్’ కోసం ఓ భారీ సబ్ జైలు సెట్ ను వేస్తున్నారట. ఈ సెట్ అదిరిపోయిందని తెలుస్తోంది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఈ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా దిశా పటానీ కూడా ఈ సినిమా సెట్ లో జాయిన్ అయింది.

అయితే ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత ప్రభాస్ కాస్త విశ్రాంతి తీసుకుంటాడట. ఆ తరువాత మళ్లీ వెంటనే ‘సలార్’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాను పూర్తి చేశారు. అలానే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’.. మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఓ సినిమా కమిట్ అయినట్లు టాక్.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus