టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) నిర్మాతగా మారి చేసిన కొత్త ప్రయత్నం ‘శుభం'(Subham). ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. హారర్ కామెడీ జోనర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని మే 9న రిలీజ్ చేశారు. గవిరెడ్డి శ్రీనివాస రావు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. కంటెంట్ పై ఉన్న నమ్మకంతో రిలీజ్ కి 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేశారు.
వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో వీకెండ్ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ సోమవారం రోజు కొంచెం తగ్గాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.65 cr |
సీడెడ్ | 0.16 cr |
ఉత్తరాంధ్ర | 0.77 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.58 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
ఓవర్సీస్ | 0.42 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 2.20 cr (షేర్) |
‘శుభం’ చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.2.2 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.6 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.0.30 కోట్లు షేర్ ని రాబట్టాలి.