చిన్న సినిమాలు (Movies) తీసే ఫిలిం మేకర్స్ తో ఓ ప్రాబ్లమ్ ఉంది.అదేంటంటే.. ఓ డిఫరెంట్ జోనర్లో తీసిన ఓ చిన్న సినిమా హిట్ అయ్యింది అంటే.. అదే ఫార్మేట్లో సినిమాలు చేస్తే సరిపోతుంది అనుకుంటారు. ఉదాహరణకి మారుతి (Maruthi Dasari) అప్పట్లో యూత్ -ఫుల్ సినిమాలు తీసి హిట్లు కొట్టాడు. ఆ తర్వాత చాలా మంది ఫిలిం మేకర్స్ మారుతి పద్దతిలోనే సినిమాలు తీశారు. కానీ అతనిలా సక్సెస్ కాలేదు. అలాగే తర్వాత హర్రర్ జోనర్లో కొన్ని చిన్న సినిమాలు వచ్చాయి.
తర్వాత మిగిలిన ఫిలిం మేకర్స్ కూడా వరుస పెట్టి హర్రర్ సినిమాలు చేశారు. కానీ ఫలితాలు ‘నాట్ సేమ్’. కొంత గ్యాప్ తర్వాత ‘ఆర్.ఎక్స్.100’ అనే చిన్న సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అది చాలా బోల్డ్ అటెంప్ట్. ఆ తర్వాత దానిలాగే చాలా బోల్డ్ సినిమాలు వచ్చాయి. కానీ హిట్లు కాలేదు. ఇక ఇప్పుడు ఇంకో ట్రెండ్ మొదలైంది. అదే మీమ్స్ ట్రెండ్. సోషల్ మీడియాలో ఓ అంశం పై పలు మీమ్స్ వస్తుంటాయి.
అవి చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అలాంటి మీమ్స్ తో కూడా కథలు అల్లేసి హిట్లు కొట్టేస్తున్నారు కొంతమంది దర్శకులు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే..’జాతి రత్నాలు’ (Jathi Ratnalu) ‘సామజవరగమన’ (Samajavaragamana) ‘మ్యాడ్’ (MAD) ‘ఆయ్’ (AAY) ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) లని చెప్పుకోవచ్చు.’జాతి రత్నాలు’ ‘సామజవరగమన’ ‘మ్యాడ్’ ‘ఆయ్’ సినిమాల్లో కంప్లీట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్స్ తోనే కామెడీ ట్రాక్..లు ఉంటాయి.
ఇక ఇటీవల వచ్చిన ‘మత్తు వదలరా 2’ సంగతి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో చాలా సీన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మీమ్స్ తోనే డిజైన్ చేసినట్లు స్పష్టమవుతుంది. త్వరలో రాబోయే ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా మీమ్స్ స్టఫ్ తో చేసిన కామెడీ ట్రాక్..లతో నిండి ఉంటుంది అని సమాచారం. అయితే ఎన్నాళ్ళు ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది అనేది.