Pavitra Lokesh: పవిత్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుచేంద్ర ప్రసాద్!

పవిత్ర లోకేశ్ సీనియర్ నరేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చేసిన ప్రకటన కన్నడ మీడియా వర్గాల్లో సంచలనం కాగా పవిత్ర మొదటి భర్త అయిన సుచేంద్ర ప్రసాద్ పవిత్ర లోకేశ్ పై సంచలన ఆరోపణలు చేశారు. పవిత్ర లోకేశ్ పై సుచేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. పవిత్ర లోకేశ్ కు ఆశలు ఎక్కువని సుచేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆమెకు కాపురాలు కూల్చడం కొత్త కాదని ఆయన చెప్పుకొచ్చారు.

పవిత్ర లోకేశ్ మనస్తత్వం డబ్బులు దోచుకునే మనస్తత్వం అని లగ్జరీగా జీవించడం పవిత్రకు ఇష్టమని ఆమెకు డబ్బులు ముఖ్యమని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నా దగ్గర డబ్బులు లేవని ఆ రీజన్ వల్లే పవిత్ర నాకు దూరంగా ఉంటోందని ఆయన కామెంట్లు చేశారు. ఆమె మనీ విషయంలో ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో నేను లేనని అందుకే ఆమె నాకు దూరంగా ఉంటోందని సుచేంద్ర ప్రసాద్ వెల్లడించారు. నన్ను పవిత్ర లోకేశ్ మోసం చేసిందని నా గురించి అసత్య ఆరోపణలు చేసిందని ఆయన తెలిపారు.

పవిత్రకు కాపురాలు కూల్చడం కొత్త కాదని ఆమె వల్ల సీనియర్ నరేష్ కాపురం కూలిపోతోందని సుచేంద్ర చెప్పుకొచ్చారు. మనీ ఎంత దొరికితే అంత దోచుకునే నేచర్ ఉన్న వ్యక్తి పవిత్ర లోకేశ్ అని సుచేంద్ర కామెంట్లు చేశారు. కష్టపడే గుణం పవిత్రకు లేదని నరేష్ పవిత్రల వివాహం జరిగినా ఆ బంధం ఎక్కువకాలం నిలవదని సుచేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పవిత్ర లోకేశ్ మనస్తత్వం నాకు తెలుసని పవిత్ర సీనియర్ నరేష్ నుంచి డబ్బును ఆశిస్తోందని ఆయన తెలిపారు.

అయితే పవిత్ర లోకేశ్ మాత్రం సుచేంద్ర ప్రసాద్ తన భర్త కాదని ఆయనతో తాను రిలేషన్ షిప్ లో ఉన్నానని పేర్కొన్నారు. పవిత్ర లోకేశ్ నరేష్ పెళ్లి వార్తల వల్ల ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుచేంద్ర ఆరోపణలపై పవిత్ర లోకేశ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus