Sudeep, Nagarjuna: ‘విక్రాంత్‌ రోణ’ గురించి కిచ్చా సుదీప్‌ ఏమన్నారంటే!

కరోనా పరిస్థితుల తర్వాత హైదరాబాద్‌ స్టూడియోల్లో షూటింగ్‌ మొదలుపెట్టిన తొలి సినిమాల్లో సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణా’ ఒకటి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. ‘బిగ్‌బాస్‌ 5’లో కూడా ఈ విషయం చెప్పారు. ఇప్పుడు మరోసారి సుదీప్‌ నాటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు. ‘విక్రాంత్‌ రోణ’ ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగానే నాగార్జున తమ సినిమా విషయంలో చేసిన పని గురించి మాట్లాడారు. రోణా పాత్ర తీర్చిదిద్దడానికే మాకు చాలా సమయం పట్టింది.

సినిమా ప్రారంభించిన కొంతకాలానికే కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. ఆ సయంలో మేమంతా హైదరాబాద్‌కు వచ్చి రెండు నెలలు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఉన్నాం. నాగార్జున ధైర్యం చేసి మా కోసం స్టూడియో తలుపులు తీశారు. ఒక్క కరోనా కేసు కూడా లేకుండా సినిమా షూట్‌ పూర్తి చేశాం. మాతో పాటు షూటింగ్‌ ప్రారంభించిన ఇతర సినిమాలు మూడు, నాలుగు రోజులు చేయగానే కరోనా కేసులు రావడంతో వాయిదా పడ్డాయి అని సుదీప్‌ చెప్పారు.

 

అక్కినేని కుటుంబంతో మాకు మంచి అనుబంధం ఉంది. నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘గీతాంజలి’. నా మొదటి రెండు చిత్రాల పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు ఈ స్టూడియోలోనే జరిగాయి. ‘విక్రాంత్‌రోణ’ షూట్‌ చాలా వరకూ ఇక్కడే చేశాం. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫుటేజీలను నాగార్జున చూసి ప్రశంసించారు. నేను అభిమానించే నటుడి నుండి ప్రశంసలు రావడం ఆనందాన్ని ఇచ్చింది అని చిత్ర దర్శకుడు అనూప్‌ చెప్పారు. ఈ సినిమాను జులై 28న ఈ సినిమా విడుదల చేస్తున్నారు.

 

ట్రైలర్‌ లాంచ్‌కు వచ్చిన అఖిల్‌ మాట్లాడుతూ ‘‘విక్రాంత్‌రోణ’ ట్రైలర్‌ చూసినప్పుడే ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ అనిపించింది. సుదీప్‌ నాకు పదేళ్ల నుండీ తెలుసు. లుక్స్‌, వాయిస్‌ మాత్రమే కాదు ఆయన మైండ్‌ కూడా చాలా పవర్‌ఫుల్‌. యువ నటుడిగా ఎప్పుడూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటా. ఇది కన్నడ పరిశ్రమ నుంచి మరో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసే మూవీ అవుతుందన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus