Sudheer Babu, Jr NTR: ఎన్టీఆర్ పై మహేష్ బావ షాకింగ్ కామెంట్స్!

ఒక హీరో మరో హీరోను ప్రశంసించడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అయితే యంగ్ హీరో సుధీర్ బాబు జూనియర్ ఎన్టీఅర్ గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా గత శుక్రవారం విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ టీనేజర్ గా ఉన్న సమయంలోనే మంచి క్రేజ్ ను కలిగి ఉండేవారని తెలిపారు.

చాలా సంవత్సరాల క్రితం తాను, ఎన్టీఆర్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్లమని ఆ టైమ్ లో హీరో మూమెంట్స్ ఎలా ఉంటాయో ఎన్టీఆర్ మూమెంట్స్ అదే విధంగా ఉండేవని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. హీరో అనే విధంగానే ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన, మాటతీరు ఉంటాయని సినిమాల్లో ఎన్టీఆర్ ఎలా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా అదే విధంగా ఉంటారని సుధీర్ బాబు వెల్లడించారు. ఎన్టీఆర్ రియల్ లైఫ్ లో కూడా హీరో అంటూ సుధీర్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ కెరీర్ విషయంలో దూసుకెళుతున్నారు. జపాన్ లో కూడా ఎన్టీఆర్ కు భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ బావ సుధీర్ బాబు ఎన్టీఆర్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో తారక్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus