ఈ శుక్రవారం నాడు అనగా అక్టోబర్ 6న చాలా చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే ‘800 ‘ ‘చిన్నా’ ‘మంత్ ఆఫ్ మధు’ ‘మ్యాడ్’ ‘మామా మశ్చీంద్ర’ ‘ఏందిరా ఈ పంచాయితీ’ ‘రూల్స్ రంజన్’..! ఇందులో ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేసిన సినిమాలు ‘మ్యాడ్’ ‘మామా మశ్చీంద్ర’ ‘రూల్స్ రంజన్’ అని చెప్పుకోవచ్చు. కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ ను పక్కన పెట్టేస్తే.. ‘మ్యాడ్’ ‘మామా మశ్చీంద్ర’ సినిమాలకి ఓ స్పెషాలిటీ ఉంది.
అదేంటి అంటే.. ‘మ్యాడ్’ లో ఎన్టీఆర్ బావమరిది (Narne Nithiin) నార్నె నితిన్ హీరోగా నటించాడు. ‘మామా మశ్చీంద్ర’ లో మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు హీరో కావడం విశేషం. సో ఒకే రోజు ఇద్దరు స్టార్ హీరోల బావమర్థుల సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి. అయితే ఇందులో ఏది సక్సెస్ అయ్యింది బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా నిలబడుతుంది అనేది అందరిలోనూ ఆసక్తిని పెంచే విషయం? ముందుగా మహేష్ బావ నటించిన ‘మామా మశ్చీంద్ర’ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.
ఓపెనింగ్స్ పరంగా మొదటి రోజు పర్వాలేదు అనిపించొచ్చు కానీ తర్వాత కష్టం. ఇక ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన ‘మ్యాడ్’ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. మొదటి షోకి బుకింగ్స్ వీక్ గా ఉన్నప్పటికీ.. మ్యాట్నీల నుండి బుకింగ్స్ పెరిగాయి. కాబట్టి ఈ వీకెండ్ ‘మ్యాడ్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశాలు ఉన్నాయి.