Sudheer Babu: అండమాన్ దీవుల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

టాలీవుడ్ హీరో, మహేష్ బావమరిది అయిన సుధీర్ బాబు.. విభిన్న కథాంశంతో కూడుకున్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ సెపరేట్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ మధ్య అతని సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ‘హంట్’ ‘మామా మశ్చీంద్ర’ వంటి వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ‘హరోం హర’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సుధీర్ బాబు..

ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే ధీమాతో ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చి.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు సుధీర్ బాబు. అందుతున్న సమాచారం.. ప్రకారం సుధీర్ బాబు అండమాన్ దీవుల్లో న్యూ ఇయర్ ట్రిప్ వేశాడు. అక్కడ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సుధీర్ బాబు కొడుకులు హైలెట్ అయ్యారు అని చెప్పాలి.

ముఖ్యంగా సుధీర్ బాబు (Sudheer Babu) పెద్ద కొడుకు అయిన చరిత్ మానస్ చాలా అందంగా ఉన్నాడు.కొన్ని యాంగిల్స్ లో ఇతన్ని చూస్తుంటే మహేష్ బాబుని చూస్తున్నట్టే అనిపిస్తుంది. మేనమామ పోలికలు ఇతనికి బాగా వచ్చినట్టు స్పష్టమవుతుంది. మరి భవిష్యత్తులో ఇతను కూడా హీరో అవుతాడా అంటే ప్రస్తుతానికి ఎస్ అని చెప్పలేం. కానీ హీరోగా ఎంట్రీ ఇస్తే మాత్రం ఇతను మహేష్ అభిమానులను ఆకర్షించే ఛాన్సులు ఉన్నాయి. సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి సుధీర్ బాబు..లేటెస్ట్ ఫ్యామిలీ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus