Sridevi Soda Center Trailer: ఆకట్టుకుంటున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్..!

‘పలాస 1978’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ ను మొత్తం తన వైపుకి తిప్పుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. అతను సుధీర్ బాబుతో తెరకెక్కిస్తున్న సెకండ్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’. గతంలో ‘భ‌లే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మా’ ‘యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన ’70.ఎం.ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థ అధినేతలు.. విజయ్ చిల్లా, శశి దేవి‌రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే విడుదల చేసిన వీడియో గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్,థర్డ్ సింగిల్, హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్ లకు మంచి స్పందన లభించింది.

ఆగష్ట్ 27న ఈ చిత్రం విడుదల కాబోతుండడంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఈ క్రమంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు తో రిలీజ్ చేయించారు. ఓ మర్డర్ కేసులో లైటింగ్ సూరిబాబు(సుధీర్ బాబు) జైలుకి వెళ్ళాడు. దానికి గల కారణం ఏంటి అన్నది ఫ్లాష్ బ్యాక్ లో చూపించబోతున్నారు అని స్ఫష్టమవుతుంది. సోడాల శ్రీదేవి అనే అమ్మాయిని సూరిబాబు ప్రేమిస్తాడు. ఇద్దరు వేరు వేరు కులాలకు చెందిన వాళ్ళు. వీళ్ళ ప్రేమకి, పెళ్లికి పెద్దలతో పాటు ఊర్లో ఉన్న పెద్దలతో కూడా సమస్య ఏర్పడుతుంది.

అలా అడ్డుపడిన వాళ్ళని ఎదుర్కొని వీళ్ళ ప్రేమ గెలిచిందా? లేదా? అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు కరుణ్ కుమార్ టేకింగ్ కొత్తగా ఉంటుందనే హోప్ ను కలిగిస్తుంది. విజువల్స్ బాగున్నాయి. మణిశర్మ బి.జి.యం కూడా బాగుంది. ‘మంచోడే కానీ మనోడు కాదు’ ‘మంచోడిగా ఉండాలంటే చాలా కష్టం రా.. ఆడి కడుపు నిండినా కళ్ళు నిండవురా’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ అయితే ఆసక్తికరంగా.. సినిమా పై అంచనాలు పెంచే విధంగానే ఉంది. సుధీర్ బాబుకి మంచి విజయాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తుంది. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus