‘జబర్దస్త్’ నుండీ సుధీర్ అండ్ టీం ఔట్.. వీడియో ద్వారా క్లారిటీ..!

కొద్దిరోజులుగా ‘జబర్దస్త్’ నుండీ సుడిగాలి సుధీర్ తప్పుకుంటున్నట్టు అనేక వార్తలు వస్తున్నాయి.ఈ షోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి…ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ అవుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం. సుధీర్‌ మాత్రమే కాదు అతనితో పాటు ఆటో రాం ప్రసాద్, గెటప్ శీను… కూడా తప్పుకుంటున్నట్టు కథనాలు వినిపించాయి.ఈ విషయం పై ఎక్స్ట్రా జబర్దస్త్ లో క్లారిటీ ఇచ్చారు ఈ 3 మంకీస్. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో 3 నిమిషాల 44సెకండ్ల వద్ద నుండీ సుధీర్,

రామ్ ప్రసాద్, గెటప్ శీనులు ఎమోషనల్ గా కామెంట్లు చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ‘ఈ విషయాన్ని మేము ఓ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలనుకున్నాం. కానీ ఈ స్టేజ్ మీద చెప్పాల్సి వస్తుంది.. మమ్మల్ని క్షమించండి.. ఇన్నిరోజులు మమ్మల్ని ఆదరించినందుకు మీకు పెద్ద థాంక్స్.. ‘ అంటూ చెబుతూ వీళ్ళు ఎమోషనల్ అయినట్టు ప్రోమోలో చూపించారు. జడ్జి రోజాతో సహా అందరూ ఏడుపుగొట్టు ఫేసులు పెట్టారు.ఇక ఎడిటింగ్ టీం వేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మనల్ని కూడా ఎమోషనల్ అయ్యేలా చేసింది.

అయితే స్టేజి పైనే ఇలాంటి సెన్సిటివ్ మేటర్ చెబుతారు అనుకోవడం నిజంగా మన అమాయకత్వమే అని కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదంతా స్కిట్ లో భాగంగా చేస్తున్నారనేది అందరి అభిప్రాయం. మరి నిజం ఏంటో రెండు రోజుల్లో తేలిపోతుంది లెండి. ఆ ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి :

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.