Suhas Remuneration: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సుహాస్!

  • December 15, 2021 / 09:38 PM IST

కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ లో నటించి వాటి ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో సుహాస్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. కొన్ని సినిమాలలో హీరో ఫ్రెండ్ రోల్స్ లో నటించి తనదైన కామెడీ టైమింగ్ తో సుహాస్ మెప్పించారు. కలర్ ఫోటో సినిమాతో సుహాస్ కు నటుడిగా మంచి పేరు వచ్చింది. హీరోగా సుహాస్ కు కలర్ ఫోటో తొలి సినిమా కాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమా అహా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కావడం గమనార్హం. సుహాస్ పలు వెబ్ సిరీస్ లలో నటించగా ఆ వెబ్ సిరీస్ లు సైతం సక్సెస్ సాధించాయి. కలర్ ఫోటోతో వచ్చిన గుర్తింపు వల్ల సుహాస్ హీరోగా బిజీ అయ్యారు. తాజాగా సుహాస్ ప్రయోగాత్మక పాత్రతో తెరకెక్కుతున్న ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు 30 లక్షల రూపాయల నుంచి 40 లక్షల రూపాయల వరకు సుహాస్ పారితోషికంగా తీసుకుంటున్నారు.

అయితే కొత్త సినిమాకు మాత్రం ఏకంగా 45 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా కోసం సుహాస్ గుండు చేయించుకోవాల్సి ఉందని ఆ రీజన్ వల్లే తను తీసుకునే రెమ్యునరేషన్ కంటే అదనంగా 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవాలని సుహాస్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. కలర్ ఫోటో సక్సెస్ సుహాస్ కు బాగానే కలిసొచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిందని వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

కథ నచ్చితే ప్రయోగాత్మక పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుహాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. సుహాస్ భవిష్యత్తు సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే హీరోగా సుహాస్ స్థాయి మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. సినిమాల విషయంలో సుహాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus