కమల్ హాసన్ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో 38 ఏళ్ళ తర్వాత ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా వస్తుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘నాయగన్’ సూపర్ హిట్ అయ్యింది. ఇక ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తెలుగు ప్రమోషన్స్ నిమిత్తం చిత్ర బృందం హైదరాబాద్ కి వచ్చింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుహాసిని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన స్పీచ్ కూడా హైలెట్ అయ్యింది.
సుహాసిని (Suhasini) మాట్లాడుతూ.. “నేను తెలుగు రాష్ట్రాలకు వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంటుంది.ఏదో తప్పిపోయి చెన్నైకి వెళ్ళి మణిరత్నంని పెళ్లి చేసుకున్నాను. లేదంటే ఇక్కడే మీతోనే ఉండిపోయేదాన్ని. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పాటే నాకు గుర్తుకొస్తుంది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనే పాట గుర్తొస్తుంది.వాస్తవానికి మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ఎలా వస్తుంది ఇలాంటి గోల్డెన్ మూమెంట్. అక్కడ మా బాబాయ్ గారు(కమల్ హాసన్) .. ఇక్కడ మా ఆయన(మణిరత్నం).
ఇది నా బెస్ట్ మూమెంట్. స్టేజిపై ఉన్న అందరికీ నేను పెద్ద ఫ్యాన్. సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. బాబాయ్ గారికి(కమల్ హాసన్ కి) కూడా రాలేదు. 80 పర్సెంట్ మూవీ చూశాను. చాలా బాగుంది. మీ అందరిలానే నేను కూడా జూన్ 5 కోసం ఎదురుచూస్తున్నాను. మణిరత్నం గారు డైరెక్టర్ గా ఎంత బెస్టో.. హజ్బెండ్ గా కూడా అంతే బెస్ట్. ‘నాయగన్’ సినిమా చూశాక.. మణిరత్నంతో పావుగంట మాట్లాడాను. ఆ సినిమా వల్లే నేను మణిరత్నంకి దగ్గరయ్యాను” అంటూ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తప్పిపోయి చెన్నై వెళ్లి మణిరత్నాన్ని పెళ్లి చేసుకున్నాను
హైదరాబాద్ కి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది#KamalHaasan #ManiRatnam #ARRahman #TrishaKrishnan #STR #ThugLife pic.twitter.com/blCUh6gsCe— Filmy Focus (@FilmyFocus) May 22, 2025