నందినీ రాయ్ (Nandini Rai) అందరికీ సుపరిచితమే. ‘040’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ‘మాయ’ ‘మోసగాళ్లకు మోసగాడు’ (Mosagallaku Mosagadu) ‘సిల్లీ ఫెలోస్’ (Silly Fellows) వంటి చిత్రాల్లో నటించింది. అయితే ‘బిగ్ బాస్ 2’ రియాల్టీ షోతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత ఓటీటీల్లో ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. ‘మెట్రో కథలు’ ‘పంచతంత్ర కథలు’ వంటి ఓటీటీ వెబ్ సిరీస్లో కూడా నటించింది. ‘వారసుడు’ ‘బాగ్ సాలె’ (Bhaag Saale) వంటి సినిమాల్లో కూడా ఈమె నటించి మెప్పించింది.
అయితే ఇప్పుడు ఈమె సైలెంట్ అయిపోయింది. అందుకు గల కారణాలు తాజాగా ఫిల్మీ ఫోకస్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ షాకిచ్చాయి అనే చెప్పాలి. ఈ ఇంటర్వ్యూలో నందినీ రాయ్ మాట్లాడుతూ.. “2017,2018 లలో నా కెరీర్ చాలా డల్ అయిపోయింది. నేను కూడా ఓ కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నాను. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఒకరోజు నాకు అనిపించింది.
నేను గోవాలో ఫ్రెండ్స్ తో కలిసి ఒక పార్టీ అటెండ్ చేశాను. అందరం బీచ్ వద్ద హ్యాపీగా హ్యాంగౌట్ అవుతున్నాం. అయితే అనుకోకుండా వాటర్లో నా కాలికి ఏదో తగులుతుంది. నేను దాన్ని అవాయిడ్ చేయాలి అనుకున్నాను. కానీ మళ్ళీ తగలడంతో అది తీసి చూశాను. అప్పుడు నేను షాక్ అయిపోయాను. ఎందుకంటే ఎవరో చేతబడి చేసి ఆ క్లాత్ లో 2 బొమ్మలు పెట్టారు. అవి ముట్టుకోకూడదట. కానీ నేను తీసి చూడటంతో.. నాలో భయం పెరిగిపోయింది.
నేను తిరిగి ఇంటికి వచ్చాక కూడా జ్వరం వచ్చేసింది. రేపు అనేది ఉంటుందా లేదా అనే రేంజ్లో డిప్రెషన్ కి వెళ్ళిపోయాను. బహుశా నా కెరీర్లో సక్సెస్ రాకపోవడానికి కూడా అదే కారణం అనే నెగిటివ్ ఎనర్జీ నన్ను కమ్మేసింది” అంటూ నందినీ రాయ్ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.