కూతురు కోసం ఒకరోజు గ్యాప్ తీసుకున్న సుక్కు!

దర్శకుడు సుకుమార్ ఒక సినిమా తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు. తనకు సంతృప్తిగా అనిపించేవరకు షూటింగ్ చేస్తూనే ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది. రెస్ట్ తీసుకోకుండా ఆయన పని చేస్తున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ కూడా చేశారు. కానీ సుకుమార్ గురించి తెలిసినవారు ఆ డేట్ కి సినిమా వస్తుందంటే నమ్మడం లేదు.

ఈ నమ్మకంతోనే కొందరు సైలెంట్ గా అదే డేట్ కి తమ సినిమాను రెడీ చేసుకుంటున్నారు. కానీ సుకుమార్ మాత్రం ఆ డేట్ కి ఎలాగైనా సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. బన్నీ కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నాడు. అందుకే ఈస్ట్ గోదావరిలో లెంగ్తీ షెడ్యూల్ చేసిన తరువాత గ్యాప్ తీసుకోకుండా కేరళ షెడ్యూల్ మొదలుపెట్టాడు సుకుమార్. బుధవారం నాడు సుకుమార్ ఇంట్లో ఓ ఫంక్షన్ ఉంది. తన కూతురికి సంబంధించిన ఈ ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్ లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఫంక్షన్ కోసం సుకుమార్ కేవలం ఒక్కరోజు మాత్రమే షూటింగ్ కి గ్యాప్ ఇచ్చాడు. సాధారణంగా సుకుమార్ ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే కనీసం వారం రోజులు సెలవు తీసుకుంటారని.. కానీ ఇప్పుడు కేవలం ఒక్కరోజుతో సరిపెట్టేశారని అంటున్నారు. ఫంక్షన్ పూర్తయిన వెంటనే కేరళ వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే సుకుమార్ ఆగస్టు 13 డేట్ ని మిస్ అయ్యేలా లేడు!

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus