Sukumar: వ్యక్తిగా మరో మెట్టు పైకి ఎక్కిన సుకుమార్!

  • December 29, 2021 / 02:45 PM IST

స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ పై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడగా ఆ అంచనాలను మించి ఈ సినిమా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. పుష్ప ది రైజ్ సక్సెస్ తో సుకుమార్ కష్టానికి తగిన ఫలితం దక్కిందనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే.

అయితే ఈ డైరెక్టర్ తాజాగా తన మంచి మనస్సును చాటుకున్నారు. పుష్ప పార్ట్1 సినిమా కోసం పని చేసిన లైట్ బాయ్ నుంచి టెక్నీషియన్ వరకు అందరికీ లక్ష రూపాయల చొప్పున ఇస్తానని సుకుమార్ షాకింగ్ ప్రకటన చేశారు. సాధారణంగా హీరోలు, నిర్మాతలు ఇలాంటి ప్రకటనలు చేస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే సుకుమార్ నుంచి ఈ తరహా ప్రకటన వెలువడటంతో అభిమానులు సైతం అవాక్కవుతున్నారు. ఈ ప్రకటనతో సుకుమార్ వ్యక్తిగా మరో మెట్టు పైకి ఎక్కారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప మూవీ సక్సెస్ మీట్ లో సుకుమార్ చేసిన ఈ ప్రకటన అందరినీ ఆకట్టుకుంది. సుకుమార్ చేసిన ప్రకటనతో పుష్ప యూనిట్ సభ్యులు చాలా సంతోషిస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న సుకుమార్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో పుష్ప పార్ట్2ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. 100 రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశారని బోగట్టా. సందర్భం వచ్చిన ప్రతిసారి ఉదారతను చాటుకుంటూ సుకుమార్ వార్తల్లో నిలుస్తున్నారు.

సినిమాసినిమాకు సుకుమార్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఒక్కో సినిమాకు సుకుమార్ 25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప2 తర్వాత చరణ్ సుకుమార్ కాంబోలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రంగస్థలం సినిమాను మించి ఉండబోతుందని సమాచారం. మెగా హీరోలతో దర్శకుడు సుకుమార్ వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus