సినిమా రూపొందాలంటే 24 ఫ్రేమ్స్ కష్టపడి పని చేయాలని చెబుతారు. వారి కో ఆర్డినేషన్, హార్డ్ వర్క్ మిస్ అయితే సినిమా మిస్‌ఫైర్ అవుతుంది అని చెబుతుంటారు. ఈ విషయం చాలా సినిమాల విషయంలో మనం చూసే ఉంటాం. అందులో కెప్టెన్ ఆఫ్ ది షిప్ పని చాలా కీలకం. ఆన్ని ఫ్రేమ్స్ సిబ్బందిని కో ఆర్డినేట్ చేసుకొని సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. దానికి ఆయనకున్న సైన్యం దర్శకత్వ సిబ్బంది, రచనా సిబ్బంది.
సినిమా టైటిల్ కార్డ్స్‌లో వారి పేర్లు వేయడం మనం చూశాం. అయితే సక్సెస్ పార్టీలో ఒక్కొక్కరిని పేరు పేరున పలకరించి, వారి గురించి చెప్పడం తక్కువ. ఆ పని చేసి చూపించారు సుకుమార్. ‘పుష్ప’ తొలి పార్ట్ సక్సెస్ పార్టీని చిత్రబృందం ఇటీవల తిరుపతిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ… తన టీమ్ మొత్తాన్ని స్టేజీ మీదకు పిలిచాడు. ఒక్కొక్కరిని పేరు పేరున పలకరించి, ప్రజలకు పరిచయం చేసి, సినిమా కోసం వాళ్లు పడ్డ కష్టం గురించి కూడా చెప్పుకొచ్చాడు.
ఇలాంటి సన్నివేశాలు ప్రీరిలీజ్ ఈవెంట్లలో, సక్సెస్ మీట్‌లో కనిపించడం చాలా అరుదు. కానీ అక్కడ ఉన్నది సుకుమార్. ఆయన గతంలోనూ ఇలాంటి పని చేశారు. సినిమాకు పని చేసిన తన టీమ్ మొత్తానికి ఇలాగే థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే పని చేశారు. సుమారు 15 నిమిషాల పాటు దర్శకత్వ, రచన సిబ్బంది గురించి మాట్లాడటం ఎంతైనా స్పెషల్. అందుకే సుకుమార్‌ను అందరూ స్పెషల్ అంటుంటారు. దానిని మరోసారి చేసి చూపించారాయన.
పేరునా ఒకొక్కరి గురించీ, వాళ్ల ప్రతిభ గురించీ వివరించి, తనకు వాళ్లెంత బలాన్ని ఇచ్చారో పూస గుచ్చినట్టు చెప్పారు మన లెక్కల మాస్టారు. కార్యక్రమానికి వచ్చిన అభిమానులు `బన్నీ బన్నీ` అంటూ అరుస్తున్నా… సుకుమార్ తన మాట మార్చుకోలేదు. తన టీమ్ గురించి గర్వంగా చెప్పడం కొనసాగించారు. సహాయ దర్శకులకు, దర్శకత్వ సిబ్బందికి సుకుమార్ ఇచ్చే విలువ అదిరిపోతుందని వినడమే. ఇప్పుడు మరోసారి చూసే అవకాశం ‘పుష్ప’తో కలిగింది. రెండో పార్టు షూటింగ్‌కి రెడీ అయ్యే ముందు టీమ్‌కి ఈ మాత్రం బూస్ట్ కావాలి లెండి.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!