Sukumar: ఆ ఊహాగానాలను నిజం చేసిన దర్శకుడు సుకుమార్..!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మూడో చిత్రంగా రూపొందుతున్న పుష్ప చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుకింగ్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. 2021 లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన టాలీవుడ్ సినిమాగా రికార్డులు సృష్టించడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు. టీజర్ , ట్రైలర్, పాటలు .. సునీల్, అనసూయ, ధనుంజయ్, ఫహాద్ ఫాజిల్ వంటి అగ్ర నటులు విభిన్నమైన మేకోవర్లలో కనిపిస్తుండం వంటివి పుష్ప పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేశాయి.

ఇక చిత్ర యూనిట్ సభ్యులు కూడా ప్రమోషన్లతో ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సుకుమార్.. ‘పుష్ప ‘ క్లైమాక్స్. మొత్తం లీక్ చేసెయ్యడం షాకిచ్చే అంశం. వివరాల్లోకి వెళితే… పుష్ప ది రైజ్ చిత్రంలో మెయిన్ విలన్ గా సునీల్ నటిస్తున్నాడని, ఇన్నాళ్లు ఆయన్ని కమెడియన్ గా చూశాం, హీరోగా చూశాం , సపోర్టింగ్ రోల్స్ లో చూసాము. గతంలో కైకాల సత్యనారాయణ గారు, కోటా శ్రీనివాసరావు గారు కామెడీ చేసినా, సపోర్టింగ్ రోల్స్ చేసినా, విలనిజం చూపించినా.. చూసాము.

దానికి వేరే తాట్ మనకి రాదు.సునీల్ గారి విషయంలో కూడా అంతే..! ఆయన ఇలాంటి పాత్రని ఇప్పటి వరకు చేయలేదు.ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తారు. ఎండింగ్లో ఫహాద్ ఫాజిల్ కనిపిస్తారని.. ఆయనకి బన్నీ గారికి ఎక్కువ కాంబినేషనల్ సీన్స్ ఉండాలని …సెకండ్ పార్ట్ లో ఆయన్ని మెయిన్ విలన్ ను చేశాం అంటూ .. విడుదలకి కొద్ది గంటల ముందే రివీల్ చేసేశాడు సుకుమార్.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus