సుకుమార్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ‘పుష్ప'(ది రైజ్) చిత్రం అతన్ని పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసింది. ‘పుష్ప 2 ‘ తో పాన్ వరల్డ్ ఇమేజ్ ను సంపాదించాలి అనుకుంటున్నాడు. ‘పుష్ప 2 ‘ పై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ స్థాయిలో సినిమా సక్సెస్ అవుతుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ‘పుష్ప 2 ‘ పాన్ వరల్డ్ మూవీగా సక్సెస్ అయితే..
(Sukumar) సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయని టాక్ వినిపిస్తుంది. ‘పుష్ప 2 ‘ ఫినిష్ అయ్యాక విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేయాలి. ఈ ప్రాజెక్టుని ఆల్రెడీ అనౌన్స్ చేశారు.కానీ ఇప్పుడు సుకుమార్ దృష్టి రాంచరణ్ పై పడినట్టు తెలుస్తుంది. రాజమౌళి కూడా సుకుమార్ – రాంచరణ్ కాంబినేషన్లో సైలెంట్ గా సినిమా స్టార్ట్ అయినట్టు లీక్ చేశాడు. అయితే మరోపక్క రాంచరణ్… శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు.
ఇది 2024 లో రిలీజ్ అవుతుంది. ఇది కంప్లీట్ అయ్యాక బుచ్చిబాబుతో చరణ్ సినిమా చేయాలి. స్క్రిప్ట్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. అయినప్పటికీ పాన్ ఇండియా సినిమా కాబట్టి 9 నెలలు టైం పడుతుంది. అప్పటికి ‘పుష్ప 2 ‘ రిలీజ్ అయిపోయి సుకుమార్ కూడా ఖాళీ అవుతాడు. ఆ తర్వాత చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో సినిమా రూపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి విజయ్ దేవరకొండ సంగతేంటి.. అనేది కూడా తెలియాల్సి ఉంది.