ఈ మధ్యనే ఒక రూమర్ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని..! దాన్ని దిల్ రాజు నిర్మించబోతున్నట్టు కూడా టాక్ నడిచింది. అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. ప్రభాస్ టీం కానీ, సుకుమార్ టీం కానీ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది లేదు. ఇంతలో ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు సుకుమార్ నెక్స్ట్ సినిమా తమ బ్యానర్లోనే ఉంటుందని.. రాంచరణ్ తో ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని చెప్పారు.
ఏప్రిల్ లేదా మే నుండే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని చెప్పడం జరిగింది. మరి నిజంగా సుకుమార్- రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా? లేక దిల్ రాజు బ్యానర్ కి వెళ్లకుండా సుకుమార్ ను వాళ్ళు లాక్ చేసే ప్రయత్నమా అనేది వాళ్ళకే తెలియాలి. అయితే ప్రభాస్ నుండి కనుక సుకుమార్ కి పిలుపు వస్తే.. దిల్ రాజు బ్యానర్లోనే సినిమా చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

ఆ ప్రాజెక్టు గురించి ఇంకా ఓ క్లారిటీ రాకముందే.. ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మరో రూమర్ వినిపిస్తుంది. అదేంటంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడట. గతంలో ప్రభాస్ కోసం త్రివిక్రమ్ కథలు రాసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అందువల్ల త్రివిక్రమ్ వెనకడుగు వేశారు.

ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే కథ డిజైన్ చేసుకోవాలి అని త్రివిక్రమ్ భావించారు. అయితే ఇప్పుడు ప్రభాస్ వచ్చే 4 ఏళ్లకు సరిపడా ప్రాజెక్టులు సెట్ చేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ సైతం వెంకటేష్ తో ఒక సినిమా, ఎన్టీఆర్ తో ఒక పాన్ ఇండియా సినిమా సెట్ చేసుకున్నారు. అవి కంప్లీట్ అవ్వడానికి కూడా 3 ఏళ్ళు టైం పట్టొచ్చు. సో ప్రభాస్- త్రివిక్రమ్.. కాంబో నెక్స్ట్ 5 ఏళ్ళకి కానీ సెట్ అయ్యే అవకాశం లేదు.
