Suma: ఆ క్షణం ఎంతో బాధ అనుభవించాను!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమ కనకాల ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి సుమా ప్రస్తుతం తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుమా తన కొడుకు సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుమకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

మీ జీవితంలో అత్యంత విషాదకర ఘటన ఏంటి అని అడగగా అందుకు ఆమె తన తండ్రి అత్తమామల మరణం అంటూ చెప్పుకు వచ్చారు. తన తండ్రి చనిపోయినప్పుడు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. నాన్న చనిపోయిన తర్వాత కేరళ తీసుకువెళ్లాము.ఆ టైంలో నేను ఒక టీవీ షో చేస్తున్నానని దానికి ప్రొడ్యూసర్ రాజీవ్ అని ఈమె తెలిపారు. ఆ వారం ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి కాలేదు.

ఒకవైపు నాన్న మరణం మరొకవైపు ఇక్కడ ఎపిసోడ్ షూటింగ్ కాలేదు దాంతో నాన్న అంత్యక్రియలు పూర్తికాగానే అలాంటి సమయంలో అమ్మకు తోడు ఉండాల్సిన నేను అమ్మను వదిలిపెట్టి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చామని వరుసగా నాలుగు ఎపిసోడ్లు చేసి తిరిగి అమ్మ దగ్గరికి వెళ్లిపోయానని తెలిపారు. ఇలా ఒక ఆర్టిస్టుగా మన వృత్తికి మనం ఎంతో గౌరవం ఇవ్వాలి. అందుకే తన వృత్తికి న్యాయం చేయడం కోసమే తాను అమ్మని అలాంటి పరిస్థితులలో కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డానని తెలియజేశారు.

అదొక్కటే కాదు పిల్లలకు బాగా లేనప్పుడు వారిని వదిలి రావడం అత్తయ్య మామయ్య చనిపోయినప్పుడు కూడా ఆ బాధను మర్చిపోయి వేదిక పైకి రాగానే నవ్వుతూ మాట్లాడాలని ఇది నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్టుకు ఎంతో బాధాకరమైనటువంటి విషయం అంటూ (Suma) సుమ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus