సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ పేరు చెప్పగానే అందరి మొహాల్లో ఒక నవ్వు వస్తుంది. అది వెకిలితనంతో కాదు.. ఆనందంతో..! ఎందుకంటే సుమ అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది.ఏదైనా సినిమా ఈవెంట్ కోసం సుమనే మేకర్స్ సంప్రదిస్తారు. ఇక బుల్లితెరపై షోలతో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఓ మెంబర్ అయిపోయింది సుమ. బుల్లితెర పై స్టార్ యాంకర్స్ లిస్ట్ కనుక తీస్తే అందులో నెంబర్ 1 సుమనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే సుమ ఫ్యామిలీ విషయాలు.. పర్సనల్ విషయాల పై జనాలకు ఫోకస్ ఎక్కువ.
ఇక అసలు మేటర్ కు వచ్చేస్తే… ఇటీవల సుమ మద్రాస్ ఐఐటీ కాలేజీకి వెళ్ళింది. అక్కడ స్టూడెంట్స్ అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కు సుమ ఫన్నీ వేలో సమాధానాలు ఇచ్చింది. ఈ సందర్భంగా సుమ వారితో మాట్లాడుతూ.. “నేను పుట్టింది పాలక్కాడ్ లో.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. అప్పుడు మా అమ్మ తెలుగు నేర్చుకుని మాకు తెలుగు నేర్పి ఇక్కడికి పంపించింది. జీవితం అంటేనే పెద్ద ఛాలెంజ్, పోయేవరకు ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది. నాకు పేరు రావాలి రావాలి అంటే రాదు.
ఏం చేయాలి అనుకుంటున్నామో అది కరెక్ట్ గా చేసినప్పుడే మనకు పేరు వస్తుంది. నా ఏజ్ కి నాకు క్లారిటీ లేనే లేదు..ఎందుకంటే నేను ఇంటర్లో బైపీసీ చేశా డిగ్రీలో బీకామ్ చేసి తర్వాత ఎంకామ్ చేశా. ముందు అకౌంట్స్ సెక్షన్ లోకి వెళ్దామనుకున్నా తర్వాత టీచర్ అవుదామనుకున్న తర్వాత ఏదో అలా అలా చేస్తూ చేస్తూ వెళ్తే దానికి యాంకర్ అని పేరు వచ్చింది.”ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీం.. ఎందుకంటే నన్ను ఇష్టపడి ఇంత దాన్ని చేసిన ప్రేక్షకుల కోసం నేను కూడా ఎంతో కొంత చేయాలి అనుకున్నా.
లేదంటే లావయిపోతానేమో అని భయం వేసింది. నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారు అలాగే జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు” అంటూ సుమ చెప్పుకొచ్చింది. దీంతో సుమ పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?