ప్రముఖ యాంకర్, బుల్లితెర వ్యాఖ్యాత, అయిన సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో సుమ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది.గతంలో కళ్యాణ ప్రాప్తిరస్తు,పవిత్ర ప్రేమ,వర్షం,ఢీ,బాద్ షా,స్వయంవరం,గీతాంజలి,రావోయి చందమామ,స్వరాభిషేకం వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం షూటింగ్ కూడా దాదాపు పూర్తయ్యింది. ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ప్రారంభమయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ లోగోని, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్ ను, రానా దగ్గుబాటి టీజర్‌ను ,టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి లాంచ్ చేయడం కూడా జరిగింది.
సుమకి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక ఈవెంట్ ను హోస్ట్ చేయడానికి రూ.1 లక్ష నుండీ రూ.1.5 లక్షలు తీసుకునే సుమ.. ‘జయమ్మ పంచాయితీ’ కోసం ఎంత పారితోషికం తీసుకొని ఉంటుంది అనే అనుమానం అందరిలోనూ నెలకొంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం సుమ రూ.50 లక్షలు పారితోషికం అందుకున్నట్టు టాక్. సుమ క్రేజ్ గురించి తెలుసు కాబట్టి..
అంత మొత్తం నిర్మాతలు సంకోచించకుండా చెల్లించారట. థియేట్రికల్ తో పాటు ఓటిటి కోసం కూడా ఈ చిత్రం మంచి రేటుకి అమ్ముడయ్యే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి. ఇక శాటిలైట్ రైట్స్ వంటివి కూడా ఉండనే ఉన్నాయి. కాబట్టి.. నిర్మాత పెట్టిన పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!