Suma: న్యూయార్క్ లో సుమను సత్కరించిన టాటా!

బుల్లితెర యాంకర్ గా బుల్లితెరపై స్టార్ మహిళగా కొనసాగుతున్న సుమ వారానికి 7 రోజులు ఎంతో బిజీబిజీగా ఇండస్ట్రీలో గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె వరుస ఈవెంట్లు, కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన రోజు వారి షెడ్యూల్ పక్కన పెట్టి న్యూయార్క్ వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ వీధులలో చక్కర్లు కొడుతూ షాపింగులు, రెస్టారెంట్లకు వెళుతూ సుమా ఎంతో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన న్యూయార్క్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

అయితే సుమ వెకేషన్ కోసం ఒంటరిగా వెళ్లడంతో పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.అయితే ఆమె కుటుంబంతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్లలేదని పని నిమిత్తం న్యూయార్క్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరి సుమ న్యూయార్క్ వెళ్లడం వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. సాధారణంగా విదేశాలలో కూడా తెలుగు సంఘాల అసోసియేషన్స్ ఉంటాయి. ఇక్కడి లాగే విదేశాలలో కూడా తెలుగు వారి కోసం ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటారు.

ఈ ఈవెంట్ కోసం ఇక్కడి నుంచి ప్రముఖ యాంకర్లు సింగర్ లను పిలిపించి పెద్దఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే న్యూయార్కులో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సుమ అందించిన సేవలకు గాను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంఘం వారు ఈమెను ఘనంగా సత్కరించారు.

ఇలా తనకు ఘనంగా సత్కారం చేసినందుకు సుమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ టాటా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సుమ కేవలం ఈ కార్యక్రమం కోసమే న్యూయార్క్ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇలా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వీరి ఖర్చు మొత్తం అసోసియేషన్ వాళ్లే భరిస్తారు కనుక సుమ న్యూయార్క్ వీధులలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈమె తిరిగి ఇండియా ఎప్పుడు పయనమవుతారో తెలియాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus