‘బిగ్ బాస్ సీజన్ 9’ క్లైమాక్స్ కి చేరుకుంది. మరో వారంలో ఈ సీజన్ ముగుస్తుంది. కాబట్టి.. మెయిన్ గేమ్ అంతా ఈ వారంతో ముగిసినట్టే. ఫినాలేలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో 14వ వారం ఎలిమినేషన్ చాలా కీలకం అనమాట.
ఇప్పుడు హౌస్‌లో 7 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వాళ్ళే సుమన్ శెట్టి, తనూజ, సంజన, డీమాన్ పవన్,ఇమ్మానుయేల్,కళ్యాణ్ పడాల, భరణి వంటి వారు. 14వ వారం నామినేషన్స్‌లో 6 మంది కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు లేదా ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అవ్వడం ఖాయమని ఇన్సైడ్ టాక్. వారు ఎవరై ఉంటారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఓటింగ్స్ ఎలా పడ్డాయా? అనే ఆసక్తి కూడా అందరికీ ఉంది.

ఓటింగ్స్ పరంగా చూసుకుంటే.. తనూజ టాప్ లో ఉంది. ఇక కళ్యాణ్ పడాల ఎలాగూ ఈ వారం నామినేషన్స్‌లో లేడు. అందువల్ల ఓటింగ్స్ స్ప్లిట్ అయ్యాయి. కాబట్టి.. మిగిలిన 5 మందిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ. అందరిలోనూ సుమన్ శెట్టికి కొద్దిపాటి పాటి ఓట్లు తక్కువైనట్టు తెలుస్తుంది. అందుకే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ.
శనివారం జరిగిన షూటింగ్ ప్రకారం కూడా.. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయినట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. సో సుమన్ శెట్టి బిగ్ బాస్ జర్నీ 14 వారాలకి ముగిసినట్టు అర్ధం చేసుకోవచ్చు.వాస్తవానికి సుమన్ శెట్టి.. మొదటి వారమే ఎలిమినేట్ అయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ అతని జెన్యూనిటీ చూశాక.. ఆడియన్స్ ఇతనికి ఓట్లు వేయడం మొదలుపెట్టారు. సో ఆ రకంగా చూసుకుంటే సుమన్ శెట్టి గ్రేట్ అనే చెప్పాలి.
