పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ‘తేరి’ రీమేక్ అని.. చాలా మంది చెప్పుకొచ్చారు. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కామెంట్స్ తో ఇది రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ‘దేఖ్ లేంగే’ సాంగ్ లాంచ్లో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ ఇలా చెప్పుకొచ్చారు.
హరీష్ శంకర్ మాట్లాడుతూ..” ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బయట చాలా రూమర్లు, నెగిటివ్ వార్తలు వచ్చాయి. వాటి సారాంశం ఏంటంటే.. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల అయ్యింది అని. కానీ ఈరోజు అసలు నిజం చెబుతున్నాను. అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల అస్సలు ఆలస్యం అవ్వలేదు.ఫస్ట్ ఒక కథ అనుకున్నాం. కాలేజీ బ్యాక్ డ్రాప్లో ఓ కథ అనుకున్నాను.

ఎందుకంటే ‘గబ్బర్ సింగ్’ లో కళ్యాణ్ గారిని చాలా మాస్ గా చూపించాను. అందువల్ల ‘జల్సా’ ‘ఖుషి’ స్టైల్లో ఆయనతో ఒక క్లాస్ సినిమా చేయాలనీ అనుకున్నాను. కానీ నేను ఏ ఈవెంట్ కి వెళ్లినా ‘మరో ‘గబ్బర్ సింగ్’ ఎప్పుడు?’ అంటూ అరుస్తున్నారు జనాలు. అందువల్ల మా కథ మరీ క్లాస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో సందిగ్ధంలో పడ్డాం. ఆ టైంలో నా మెంటల్ కండిషన్ కూడా దెబ్బతింది.
తర్వాత ఒక రీమేక్ అనుకున్నాం. అది కూడా మమ్మల్ని ఎక్సయిట్ చేయలేదు.కాబట్టి.. నా వల్లే లేట్ అయ్యింది. అయితే ఎంత లేట్ అయినా ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉండాలని నేచర్ తీసుకున్న టైం ఇది. పవన్ కళ్యాణ్ గారు వరుసగా డేట్స్ ఇచ్చి.. 18 గంటలు,20 గంటలు పనిచేసి సినిమాని కంప్లీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు.
ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. ప్రయత్నంలో లోపం ఉండకూడదు అని. అందుకే ఆయన ఈరోజు ఆ రేంజ్లో ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.
