సుమన్…చిరంజీవి సుప్రీం హీరోగా ఉన్న కాలంలో సుమన్ సినిమాలతో పోటీ పడటానికి, పోటీ పడి రిలీజ్ చెయ్యడానికి, ఇంకా చెప్పాలి అంటే సుమన్ సినిమాలపై పై చేయి సాధించడానికి చాలా ఇబ్బందులు పడే వారు, అదీ అప్పుడు సుమన్ రేంజ్…అయితే కాలక్రమేణా హీరోగా వెనుకబడిపోయినప్పటికీ ఇంకా సినిమాల్లోనే కొనసాగుతూ అందరినీ అలరిస్తున్న సుమన్, గత కొంతకాలంగా ఫాన్స్ తో , ఫ్రెండ్స్ తో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి దృష్టిని తనపై తిప్పుకున్నాడు..అయితే పొలిటికల్ ఎంట్రీ పై ఆయన ఇంట్రెస్ట్ అడిగినప్పుడల్లా…నాకు అసలు అవంటేనే పడదు అంటూ షరా మామూలుగా కౌంటర్ ఇచ్చేశారు…అయితే అది ఒకప్పటి మాట…లెండి ఇప్పుడు మాట మారింది…తాను పాలిటిక్స్ లోకి వస్తున్నా అంటున్నాడు సుమన్…త్వరలోనే తాను రాజకీయంగా అడుగు పెట్టబోతున్నా అనీ పార్టీ ఏది అనే విషయం లో తనకి ఇంకా స్పష్టత రాలేదు అనీ సుమన్ స్పష్టం చేశారు…
రాజకీయాల్లో నాయకులుగా ఉండే చాలామంది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు అనీ తను అలా జనాలని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాను అని సుమన్ అప్పుడే పొలిటికల్ స్పీచ్ లు మొదలు పెట్టారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నారు అని, ప్రజలకు తన వంతుగా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు సుమన్ కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఏ పార్టీలో చేరతారు? ఎప్పుడు చేరతారు అన్న విషయంపై ఆయన క్లారిటీ ఇస్తూ…ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటిస్తానని సుమన్ తెలిపారు…మరి మొత్తంగా చూసుకుంటే ఈ సీనియర్ హీరో త్వరలోనే పీపల్స్ హీరో అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడన్న మాట…చూద్దాం సుమన్ ఏ పార్టీలో ఎలా సెటిల్ అవుతాడో.