కొన్నాళ్ల నుండి సినీ పరిశ్రమలో ఎక్కువగా బ్యాడ్ న్యూస్..లు వినిపిస్తున్నాయి. దర్శకనిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు, యూనిట్ మెంబర్స్ ఇలా ఎవరొకరు మరణించారు అనే వార్తలు ఎక్కువవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, వంటి సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటి బ్యాడ్ న్యూస్..లు వింటూ ఉన్నాం. ఇటీవల మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, ‘సింటోనియా’ నటి బ్రెజిలియన్ చైల్డ్ ఆర్టిస్ట్ వంటి వారు మరణించారు.
ఈ విషాదాల నుండి ఇండస్ట్రీ ఇంకా కోలుకోకముందే… ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. హిందీ సినీ పరిశ్రమలో నేషనల్ అవార్డు విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్ ఈరోజు మరణించారు. ఆయన వయసు 51 ఏళ్ళు మాత్రమే. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు తెలుస్తుంది.
హిందీలోనే కాకుండా మరాఠీ సినిమాలకి అలాగే పలు సౌత్ ఇండియన్ సినిమాలకు ఆయన పనిచేశారు. ‘పానిపట్’ ‘బెల్ బాటమ్’ ‘బ్లాక్ మెయిల్’ ‘దంగల్’ ‘ఉరి’ ‘PK’ ‘కేధర్నాథ్’ ‘సూపర్ 30’ వంటి సినిమాలకు విక్రమ్ గైక్వాడ్ పనిచేశారు. 2011 లో వచ్చిన విద్యా బాలన్ డర్టీ పిక్చర్ సినిమాకి గాను విక్రమ్ గైక్వాడ్ నేషనల్ అవార్డు అందుకున్నారు. కొన్ని సినిమాల్లో ఈయన నటుడిగా కూడా గెస్ట్ రోల్స్ వంటి ఇతర పాత్రలు చేశారు.