Tollywood: సమ్మర్‌ టాలీవుడ్‌కి ఏం ఇవ్వలేదు… మొత్తం వాళ్లకే ఇచ్చేశారు!

టాలీవుడ్‌కి బెస్ట్‌ సీజన్లు అంటే పొంగల్‌, సమ్మర్‌, దసరా, డిసెంబరు అని చెప్పాలి. ఏటా ఈ సీజన్లలో సినిమాలు భారీగా రావడం, మంచి విజయాలు అందుకోవడం చూస్తూ ఉంటాం. గతేడాది కూడా ఇలా మంచి మంచి సినిమాలొచ్చి భారీ విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది సమ్మర్‌ సీజన్‌ కాబ్టటి.. ఈ సమ్మర్‌ గురించే మాట్లాడుకుందాం. లాస్ట్‌ ఇయర్‌ వేసవిలో వచ్చిన సినిమాలు టాలీవుడ్‌కి బాగా కలిసొచ్చాయి. కానీ ఈసారి మొత్తంగా మారిపోయింది.

కరోనా వల్ల ఆగుతూ ఆగుతూ గతేడాది కొన్ని భారీ సినిమాలు సమ్మర్‌లో బాక్సాఫీసు దగ్గరకు వచ్చాయి. వాటిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్‌ 3’, ‘అంటే సుందరానికి’, ‘గని’ లాంటివి వచ్చాయి. అయితే అన్నీ విజయాలు సాధించకపోయినా పేరున్న చిత్రాలు వచ్చాయి అనే ఫీలింగ్‌ అయితే కలిగించాయి. కానీ ఈ ఏడాది చూస్తే… పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే సరైన విజయం పక్కన పెడితే మొత్తంగా సరైన సినిమానే ఇప్పటివరకు థియేటర్లలోకి రాలేదు.

దీంతో డబ్బింగ్‌ సినిమాల హవా నడుస్తోంది. కమల్ హాసన్‌ ‘విక్రమ్’, ‘కాంతార’, ‘కేజీయఫ్ 2’ సినిమా రేంజ్ హిట్‌ కాకపోయినా ఇప్పుడు థియేటర్లలో డబ్బింగ్‌ సినిమాలదే హవా. అలా ఈ సమ్మర్‌ డబ్బింగ్‌ సినిమాలదే అని చెప్పొచ్చు. థియేటర్లలో చూస్తే.. ‘2018’, ‘బిచ్చగాడు 2’ లాంటి సినిమాలదే హవా అని చెప్పొచ్చు. అయితే ‘విరూపాక్ష’ సినిమా లేకపోయుంటే టాలీవుడ్‌ ఆచూకీనే ఈ సమ్మర్‌లో లేకుండా పోయేది.

ఏప్రిల్‌లో చూస్తే ‘రావణాసుర’, ‘మీటర్‌’, ‘శాకుంతలం’, ‘రామబాణం’ ‘ఉగ్రం’, ‘కస్టడీ’, ‘అన్నీ మంచి శకునములే’, ‘సామజవరగమణ’ సినిమాలు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయాయి. ఇందాక చెప్పినట్లు ‘విరూపక్ష’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సమ్మర్‌లో డబ్బింగ్‌ సినిమాల హవా అందులోనూ కీలకమైన మే నెలలో ఎక్కువగా కనిపించింది అని చెప్పాలి. ప్లానింగ్‌ లేకనే కథల్లో పస లేకపోవడం వల్లనో ఇలా జరిగింది అని చెప్పాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus