చిత్ర పరిశ్రమలో ఏదో సాధించాలని ఎన్నో ఆశలతో అడుగులు వేస్తారు నటీ నటీమణులు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కొంత మంది ఎన్ని సినిమాలు చేసినా అందుకు తగిన గుర్తింపు సంపాదించుకోలేరు. మరికొంత మంది నటీనటులు ఒకటి, రెండు సినిమాలు చేసినా ప్రేక్షకుల గుండెల్లో కలకాలం నిలిచిపోతుంటారు. అలా గుర్తుండిపోయే హీరోయిన్లలో సుందరకాండ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఒకరు. నిజానికి ఈ పాత్ర కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారట.
చివరికి కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని భావించి అపర్ణను తీసుకున్నారట. ఒక రోజు రాఘవేంద్రరావు.. ఆ చిత్ర నిర్మాత కె వి వి సత్యనారాయణ ఇంటికి వెళ్లి తనకు ఓ అమ్మాయి బాగా నచ్చిందని.. తను మన సినిమాలో చేస్తే బాగా సెట్ అవుతుందని చెప్పారట. సరిగ్గా పది రోజుల తర్వాత ఈ సినిమా కోసం జరిగిన ఆడిషన్స్ కు ఆ అమ్మాయి వచ్చింది. దీంతో రాఘవేంద్రరావు అక్కడున్న వారిని ఈ అమ్మాయి పూర్తి డీటేల్స్ ఏంటి అని అని అడిగారు.
అక్కడ అసిస్టెంట్ ఆమె సత్యనారాయణ మేనకోడలు.. ఆమె పేరు అపర్ణ అని చెప్పారట. వెంటనే రాఘవేంద్రరావు ఆమెను ఓకే చేశారట. కానీ అసలు అపర్ణాకు అసలు యాక్టింగ్ వచ్చా? రాదా ? అని ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డారట. కానీ షూటింగ్లో తన అద్భుతమైన నటను చూసి షాక్ అయిపోయారట. ఇక ఈ సినిమా అనంతరం అపర్ణకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ వారి కుటుంబ సభ్యులకు హీరోయిన్ గా చేయడం ఇష్టం లేక సినిమాల నుంచి ఆమెను తప్పించారు.
కానీ దాసరి నారాయణ రావు ‘అక్క పెత్తనం చెల్లి కాపురం’ అనే సినిమాలో చివరిసారిగా తీసుకున్నారు. తర్వాత అపర్ణ 2002లో వివాహం చేసుకుని అమెరికా వెళ్లి స్థిర పడింది. ఆమె నటించిన మొదటి సినిమానే హిట్ అవడంతో ఈమెకి (Actress Aprna) మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ప్రస్తుతం అపర్ణ తన భర్తతో లైఫ్ లీడ్ చేస్తుంది.