Sundeep Kishan: సందీప్ కిషన్.. క్లిక్కవ్వడానికి ఇదే బెస్ట్ ఛాన్స్!
- November 21, 2024 / 09:30 AM ISTByFilmy Focus
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) తన కెరీర్‌లో మరో కీలక మలుపు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న సందీప్ కిషన్, ఇప్పటి వరకు తనకు సరైన స్థాయిలో హిట్ అందకపోయినప్పటికీ, వెనుకడుగు వేయడం లేదు. తాజాగా, ధనుష్‌తో (Dhanush) చేసిన రాయన్ (Raayan) మూవీలో సపోర్టింగ్ రోల్ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతని మజాకా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Sundeep Kishan

సంక్రాంతికి ప్లాన్ చేసిన ఈ మూవీ పోటీ కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఇక సందీప్ కిషన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను కోలీవుడ్‌లో ప్రారంభించనున్నాడు. ఈ చిత్రానికి మరింత ప్రత్యేకతను తెచ్చేది ఇళయదళపతి విజయ్ (Vijay Thalapathy) కొడుకు జాసన్ సంజయ్. విజయ్ రాజకీయ రంగప్రవేశం నేపథ్యంలో, అతని కుమారుడు సినిమాల్లో అడుగు పెడుతాడని అందరూ భావించారు. కానీ జాసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాడు.

లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రానికి బడా బ్యానర్‌గా వ్యవహరిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా సందీప్ కిషన్‌ను ఎంపిక చేయడం విశేషం. అలాగే సంగీతం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ను (S.S.Thaman) ఎంపిక చేసినట్లు సమాచారం. విజయ్ అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. జాసన్ దర్శకత్వంలో సందీప్ ఎలా కనిపిస్తాడు, ఈ సినిమా విజయ్ వారసుడికి కొత్త విజయాన్ని తెస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.

సందీప్ కిషన్ ఇప్పటికే తన కెరీర్‌లో కొన్ని మంచి చిత్రాలు చేసినప్పటికీ, కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. తమిళనాడులో ఈ ప్రాజెక్ట్‌తో అతని మార్కెట్ పెరుగుతుందన్న నమ్మకం ఉంది. కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఈ సినిమా అతనికి చక్కని అవకాశం. ఈ సినిమా సక్సెస్ అయితే, తమిళంతో పాటు ఇతర భాషలలో కూడా సందీప్ కొత్త అవకాశాలను అందుకునే చాన్స్ ఉంటుంది.

















