సంక్రాంతి బరిలోకి ఈసారీ చిన్న సినిమా.. అంత ధైర్యం ఏమిటో?

వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏంటి? రెండు నెలల క్రితం ఈ ప్రశ్న వచ్చినప్పుడు చాలా సినిమాల పేర్లు వినిపించాయి. రోజులు గడిచే కొద్దీ సినిమాల నెంబరు తగ్గుతూ వచ్చింది. ఇంకా మూడు నెలలు ఉంది అనుకుంటున్న ఈ సమయంలో మూడు సినిమాలే మిగిలి ఉన్నాయి అని నిన్నటి వరకు తెలిసింది. అయితే గత కొన్నేళ్లుగా జరుగుతున్నట్లుగానే ఈసారీ చిన్న సినిమా కూడా రెడీ అవుతోంది. 2025 సంక్రాంతి రేసులో వచ్చే సినిమాల కోసం ఇప్పటికే థియేటర్ల లెక్కలు మొదలయ్యాయి అని అంటున్నారు.

Sundeep Kishan

ఎందుకంటే పొంగల్‌ ఫైట్‌లో చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara), వెంకటేష్ (Venkatesh) – అనిల్ రావిపూడిల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు)తోపాటు అజిత్ (Ajith) – మైత్రీ మూవీ మేకర్స్‌ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఉన్నాయి. అయితే ఇప్పుడు నాలుగో సినిమా రెడీ అయ్యింది. మామూలుగా అయితే సంక్రాంతి సీజన్‌ కోసం టాలీవుడ్‌లో ఓ చిన్న సినిమా కూడా ఉంటుంది. అలా ఈ సారి సందీప్ కిషన్ (Sundeep Kishan) – నక్కిన త్రినాధరావు కలయికలో రూపొందుతున్న సినిమాను సంక్రాంతికి తీసుకొస్తారని చెబుతున్నారు.

సినిమాకు ‘మజాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. ఈ సినిమా కథ ఏంటి అనే విషయంలో కూడా ఓ చిన్న సమాచారం మనకు ఇప్పటికే ఉంది. అంతేకాదు ఆ సినిమా కథే సందీప్‌ కిషన్‌కు (Sandeep kishan) ధైర్యం ఇచ్చింది అని అంటున్నారు. ఈ ధైర్యమే సినిమా ఓటీటీ డీల్‌ను పూర్తి చేశారు అని చెబుతున్నారు. అలాగే ఫిబ్రవరిలో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కి ఇస్తున్నారు అని కూడా అంటున్నారు. ఆ లెక్కన జనవరిలో సినిమా థియేటర్‌లోకి వచ్చేస్తుంది అని చెబుతున్నారు.

జనవరి అంటే సంక్రాంతే అని అంటున్నారు. గతంలో ఓ అగ్ర హీరో కోసం ప్రసన్నకుమార్‌ బెజవాడ రాసుకున్న ఆ కథనే ఇప్పుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా చేస్తున్నాడు. ఆ హీరో వదులుకున్న కథతో సందీప్‌ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

మహేష్‌ మేనల్లుడు కొత్త సినిమా.. అమెరికా నేపథ్యంలో తెలుగమ్మాయితో..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus